లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

ESI స్కామ్ : కుంభకోణం బయటపెట్టింది ఈయనే

హైదరాబాద్‌ ఈఎస్‌ఐ స్కామ్‌ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు

Published

on

esi scam, acb raids continues

హైదరాబాద్‌ ఈఎస్‌ఐ స్కామ్‌ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు

హైదరాబాద్‌ ఈఎస్‌ఐ స్కామ్‌ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ దేవికారాణి, వరంగల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మతో పాటు… ఓ ఛానల్‌ ప్రతినిధి కాజీపేట నరేందర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో 23 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రికార్డులు, హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్రంగా మెడికల్‌ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 10 కోట్ల రూపాయల మేర గోల్‌మాల్‌ అయినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు.  ఈ స్కామ్‌లో 17 మంది ఈఎస్‌ఐ ఉద్యోగులతో పాటు నలుగురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈఎస్ఐ ఉద్యోగులతో కలిసి దేవికారాణి అక్రమాలకు పాల్పడిందని ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా కుంభకోణం జరిగిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి స్కామ్ చేసినట్టు గుర్తించారు.
17మంది ఈఎస్ఐ ఉద్యోగులు సహా నలుగురు ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అనవసరమైన మందులు కొనుగోళ్లు చేశారని చెప్పారు. 2017-18 ఏడాదిలో రూ.43 కోట్ల విలువైన అనవర మందులు కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈ కుంభకోణం బయటపెట్టారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఆయన.. భారీ స్కామ్ ని వెలుగులోకి తెచ్చారు.