లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

10Tv Exclusive Interview: సీఎం మారబోతున్నారా?

Published

on

Etela Rajender:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమేనా? కేటీఆర్‌ సీఎం కాబోతున్నారా? టీఆర్ఎస్ నేతలు.. మంత్రులు ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని పలు సంధర్భాల్లో ప్రస్తావించారు. కేటీఆర్ సీఎం అవుతారని, హరీష్‌రావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని రాష్ట్రంలో ముఖ్యనేతగా, రాష్ట్రమంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ చేసిన రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది? కేసీఆర్‌ అందుబాటులో లేనప్పుడు ఇప్పటికే ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనే అన్నీ అర్హతలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సీఎం మార్పు సంకేతాలను సూచిస్తున్నాయి. ఎవరు మాట్లాడినా ముఖ్యమంత్రి మార్పు గురించి మాట్లాడేంత ధైర్యం ఉండదు. పై నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తేనే మాట్లాడతారని, ఈటల చేసిన వ్యాఖ్యలు కూడా సంకేతాల నుంచి వచ్చిన సందేశమే అంటున్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారతారని, సీఎం కేసీఆర్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం అవుతారని, మార్పు ఉంటే ఉండవచ్చునని, ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చని అన్నారు. ఆదివారం(17 జనవరి 2021) రాత్రి 10Tv ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం మార్పు ప్రచారంపై ఈటల మాట్లాడారు. ‘‘ఉంటే ఉండొచ్చు! తప్పకుండా!! తప్పేముంది?’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 99శాతం కార్యక్రమాలు మంత్రి కేటీఆర్‌ చూస్తారని, టీకా ప్రారంభ కార్యక్రమంలోనూ పాల్గొన్నారని, ముఖ్యమంత్రి అందుబాటులో లేని అనేక సందర్భాల్లో ఆ పాత్రను కేటీఆర్‌ పోషిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.