లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ప్రకృతి వింతలు : చెట్లలోంచి వాటర్ ఫాల్..వైరల్ వీడియోలు

Published

on

Water Trees : ప్రకృతిలో ఎన్నో వింతలు ఎన్నెన్నో విచిత్రాలు దాగున్నాయి. అటువంటి వింతల్లో వాటర్ ట్రీ (Water Tree) ఒకటి. వాటర్ ట్రీ అంటే ఏదో చెట్టునుంచి వాటర్ చిన్నగా కారుతుందని కాదు. ఏకంగా జలపాతంలాంటి ధారతో నీటికి చిందిస్తుందీ చెట్టు. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుందీ?ఆ చెట్టు గురించి అటువంటి మరికొన్ని చెట్లగురించి తెలుసుకుందాం..అది యూరప్ ఖండంలోని మాంటెనెగ్రోలో దేశం. ఆ దేశంలోని దినోసా అనే గ్రామంలో ఈ చిత్రమైన వాటర్ ట్రీ ఉంది. దినోసా గ్రామానికి వెళ్లి వాటర్ ట్రీ ఎక్కడుందో అడిగితే ఎవ్వరైనా సరే చెప్పేస్తారు. ఈ చెట్టు ఉన్న ప్రాంతంలో వర్షం పడిందంటే చాలు. చెట్టులోంచి నీరు వాటర్ ఫాల్ లా వచ్చేస్తుంది.

వర్షం తగ్గినా… చెట్టు కాండం నుంచి నీరు ధారలా..చిన్న సైజు జలపాతంలా బయటకు ఉరికివస్తూంటుంది. అది మల్బరీ చెట్టు. చాలా పెద్దది. మరి ఇలా జరగటానికి కారణం ఏంటో తెలియదంటున్నారు స్థానికులు. ప్రకృతి వింత అని మాత్రం చెప్పుకోవచ్చు.చెట్టు లోపల భూమిలో నీటి బుగ్గలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు వాటి నుంచి నీరు పైకి ఉబుకుతూ ఉంటుంది. ఫలితంగా చెట్టు వేర్లు, కాండం నుంచి నీరు పైకి వస్తూ… అక్కడున్న చిన్న తొర్ర నుంచి బయటకు కారుతోంది. ఇదంతా చూడటానికి చిత్రంగా..సరదాగా ఉంటుంది.ఇలా ఇటువంటి చెట్లు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కామెరూన్ ‌లోని బుయాలో కూడా ఓ చెట్టు కాండానికి చిన్న కన్నం పెడితే చాలు..నీరు ధారలా బయటకు చిమ్ముతుంది. ఆ నీటిని తాగునీరులాగానే ఉంటుంది. ఈ తరహా చెట్లు… నీటిని తమ కాండాలలో దాచుకుంటాయి. ఎండాకాలంలో ఆ నీటిని వాడుకుంటాయి.ఇండియాలోనూ ఇటువంటి వాటర్ ట్రీలు ఉన్నాయి. క్రొకడైల్ బార్క్ ట్రీ (మొసలి తోలు చెట్టు). వాటి సైంటిఫిక్ పేరు టెర్మినలియా ఎల్లిప్టికా (Terminalia Elliptica). ఇవి వేసికాలంలో నీటిని దాచి పెట్టుకుంటాయి. చెట్టు బెరడును పగలగొడితే… చెట్టు కాండంలోంచీ నీరు ధారలా బయటకు వస్తుంది.ఈ చెట్టు బెరడు…మంటల్ని నివారిస్తుందికూడా. అంటే ఈ చెట్టు చుట్టుపక్కల అగ్నిప్రమాదం జరిగినా ఈ చెట్టుకుమాత్రం మంటలు అంటవు. అందువల్ల ఎండాకాలంలో అడవుల్లో తిరిగే అధికారులకు…ఈ చెట్లు తాగునీటిని అందిస్తాయి. ఇటువంటి ప్రకృతి చిత్రాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకున్నప్పుడు భలే ఆశ్చర్యంగా…అనిపిస్తుంది కదూ..

 

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *