లైఫ్‌లో ‘ఆహా’ ఉండాల్సిందే.. Aha OTT ఈవెంట్‌లో అల్లు అర్జున్ సందడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Aha Biggest OTT Event : కలర్ ఫుల్ ఆహా ఈవెంట్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ రాకతో ఆడియెన్స్‌లో ఫుల్ జోష్ కనిపించింది.

లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఈవెంట్ కావడంతో ఓటీటీ ప్లాట్ ఫాంలో అతిపెద్ద ఈవెంట్ ‘ఆహా’ అదిరిపోయేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ విచ్చేశారు. ఈ సందర్భంగా లైఫ్‌లో ఆహా ఉండాల్సిందేన్నారు.ఓటీటీ తీసుకురావాలని రెండేళ్ల కిందే అనుకున్నామని బన్నీ చెప్పారు. అవుతుందా లేదా అని చాలా ఆలోచించామని అన్నారు. మమ్మల్ని నమ్మినందుకు జూపల్లి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు బన్నీ.టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీలాగే ఓటీటీ కూడా ఇండస్ట్రీనేనని బన్నీ చెప్పారు. వంద శాతం తెలుగు ప్లాట్ ఫామ్ గా ఆహా ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ జర్నీలో తోడున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఓటీటీ ప్లాట్ ఫాంపై ఆహా ప్రారంభమైన ఏడాదిలోపే అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్, 6 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అదిరిపోయే ఈవెంట్ ఏర్పాటు చేశారు ‘ఆహా’ నిర్వాహకులు.ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇదే అతిపెద్ద ఈవెంట్. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయగా.. అల్లు అరవింద్, ఆహా సీఈవో అజిత్ ఠాకూర్, మై హోమ్ గ్రూఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ జూపల్లి, దిల్ రాజు, దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి, అల్లుడు అర్చిత్ రెడ్డి, వంశీ పైడిపల్లి, శరత్ మరార్ తదితరులు పాల్గొన్నారు.

Related Tags :

Related Posts :