లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కరోనాతో మరో టి. కాంగ్రెస్ నేత కన్నుమూత

Published

on

ex-mp-nandi-yellaiah-died-with-coronavirus-1

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తో నేతలు కన్నుమూస్తున్నారు. తాజాగా మాజీ ఎంపి నంది ఎల్లయ్య (78) తుదిశ్వాస విడిచారు. 2020, జులై 29వ తేదీన కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను కుటుంబసభ్యుులు నిమ్స్ ఆసుపత్రిలో చేరిపించారు.అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే..చికిత్స పొందుతూ..2020, ఆగస్టు 08వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల..నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్దతతో క్రమశిక్షణతో పని చేశారని నేతలు కొనియాడారు. ఓటమి ఎరగని నేత, దళిత బాంధవుడు నంది ఎల్లయ్య అంటూ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా అభివర్ణించారు.నంది ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు టి. కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఇక నంది ఎల్లయ్య విషయానికి వస్తే…కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. నాగర్ కర్నూల్ నుంచి, ఐదు సార్లు సిద్ధిపేట నుంచి మొత్తం ఆరుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.

1979 – 84, 1989 – 97 కాలంలో రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 2014 నుంచి 2019 వరకు నాగర్ కర్నూల్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *