108 అంబులెన్స్ కు నిప్పుపెట్టిన రౌడీ షీటర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు   సెప్టెంబర్ 15, మంగళవారం రాత్రి  సురేష్ ను  పోలీసు  స్టేషన్ కు పిలిచారు.

పోలీసులు విచారిస్తుండగా సురేష్ వింతగా ప్రవర్తించాడు.  పోలీస్ స్టేషన్‌ భవనంలోని అద్దాలు పగలగొట్టడంతో అతని చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతని మానసిక పరిస్థితి బాగా లేదని గ్రహించిన పోలీసులు నిందితుడిని ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని పిలిపించారు. నిందితుడ్ని వాహనంలోకి ఎక్కించగా, అంబులెన్సో లో ఉన్నస్పిరిట్ ను వాహనం మొత్తం చల్లి  తన వద్దనున్న అగ్గిపెట్టెతో 108 వాహనానాకి నిప్పంటించాడు.వాహనంలో స్పిరిట్‌, శానిటైజర్‌ బాటిల్స్‌ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి అక్కడికక్కడే దగ్ధమైంది. వెంటనే పోలీసులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. నిందితుడిని పోలీసులు అతికష్టం మీద రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈఘటన  తెల్లవారుఝామున 2గంటల సమయంలో జరిగింది.

Related Posts