పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్ విరాళమివ్వనున్న కెనడా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తమకు సరిపడ కరోనా వ్యాక్సిన్ డోసులు ఉంచుకుని మిగిలిన వాటిని కొవిడ్ 19తో బాధపడుతున్న పేద దేశాలకు విరాళంగా ఇవ్వాలని కెనాడా చర్చలు జరపుతుంది. ఈ మేరకు కెనాడా ఇతర దేశాల కంటే ఎక్కువ డోసులు కొనుగోలు చేస్తుందని నార్త్ కరోలినాలోని డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ సెంటర్ రీసెర్చర్స్ చెబుతున్నారు. సంపద కలిగిన దేశాల్లో ఒకటైన కెనడా చివరి దశలో ఉన్న వ్యాక్సిన్ ట్రయల్స్ లో కాస్త ముందు చూపు చూపించింది. తమ దేశం కోసం వ్యాక్సిన్ డోసులను రిజర్వ్ చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ కావాలని ఆర్డర్ చేస్తుంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహకారంతో కెనడా COVAX ఫెసిలిటీని పేద దేశాలకు కూడా అందించాలని అనుకుంటున్నట్లు కెనడియన్ గవర్నమెంట్ నుంచి సమాచారం. కొవిడ్ 19 వ్యాక్సిన్ విరాళం గురించి కొవాక్స్ చర్చలు కన్ఫామ్ చేశాయి. మరొకరి నుంచి అందిన సమాచారం ప్రకారం.. ‘మేం ఈ డోసులు వేస్ట్ చేయడానికి ఒప్పుకోం’ అని అన్నారు.చివరి దశ ఫలితాలు వెల్లడించిన ఫైజర్, మోడర్నా నుంచి ఆ దేశంలో జనాభాకు మించి కొనుగోలు చేసింది కెనడా. ఒక్కొక్క కంపెనీ నుంచి 20 మిలియన్ డోసులను ఆర్డర్ పెట్టింది. డిఫరెంట్ వ్యాక్సిన్లు విభిన్న పద్ధతుల్లో పనిచేస్తుండగా కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం ఇవే కాకుండా మిగిలినవి కూడా అంతే సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంటున్నారు.

ICICI Bank ‘Cardless EMI’, ప్రయోజనాలివే


దీని కోసం సంప్రదించిన కొవాక్స్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేయాలనుకుంటున్న గవీ వ్యాక్సిన్ గ్రూప్ ప్రొడక్ట్. వ్యాక్సిన్ కరెక్ట్ అని తెలుసుకుంటే దానిని కొనుగోలు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంది. 2021చివరి నాటికి కొవిడ్ వ్యాక్సిన్ డోసులు 2బిలియన్ వరకూ చేరుకోవచ్చు. ఇప్పటికే నిధులు 2బిలియన్ డాలర్లు రాగా మరో 5బిలియన్ డాలర్లు అయితేనే గానీ, లక్ష్యాన్ని చేరుకోలేరు.

కెనడా జనాభా 38 మిలియన్ ఉండగా 414 మిలియన్ వ్యాక్సిన్ డోసులకు ఏడు సార్లు కొనుగోలు చేసి ఆర్డర్ పెట్టింది. అనుకోకుండా ఏడింటి నుంచి కెనడాకు అప్రూవ్ వచ్చింది. అవన్నీ డెలివరీ అయితే ఆ దేశజనాభా కంటే ఐదు రెట్లు ఎక్కువ తీసుకున్నట్లే. కొందరి ఆలోచన మేరకు ముందుగా వచ్చే వ్యాక్సిన్లు ఒకొక్కరికి రెండేసి డోసులు ఇవ్వాలని సమాచారం.

Related Tags :

Related Posts :