Hottest Summer : బాబోయ్, మండిపోతున్న ఎండలు.. మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందా?

ఎండ మండిపోతోంది. మాడు పగిలిపోతోంది. కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్. అప్పుడే ఏమైంది.. ముందుంది సినిమా అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ముందు ముందు ఎండలు మరింత మండిపోతాయని చెబుతున్నారు. ఈ ఏడాది చాలా హాట్ గురూ అని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.(Hot Summer)