ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు.!

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు.!

Sajjanar : TSRTC MDగా బాధ్యతలు చేపట్టారు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్. హైదరాబాద్ లోని ఆర్టీసీ భవన్ లో చార్జ్ తీసుకున్నారు సజ్జనార్. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు తీసుకున్నాక.. ఫైల్ పై తొలి సంతకం చేశారు సజ్జనార్.

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక… రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు సజ్జనార్. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ అభినందనలు తెలిపారు.

ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు చేపట్టిన సునీల్ శర్మ కు శాలువా కప్పి సత్కరించారు మంత్రి. ఆ తర్వాత.. సజ్జనార్ సహా… ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆర్టీసీలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

వరంగల్ యాసిడ్ దాడి, 2019 దిశ అత్యాచారం-హత్య కేసుల్లో నిందితుల ఎన్ కౌంటర్ తో సజ్జనార్ పేరు దేశమంతటా మార్మోగింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సజ్జనార్… సైబరాబాద్ సీపీగా మొన్నటివరకు విధులు నిర్వర్తించారు. తాజాగా.. ప్రభుత్వం ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించడంతో.. బాధ్యతలు తీసుకున్నారు.

×