వరద బీభత్సం 2.0 : సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు, కొట్టుకపోయిన వాహనాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Exclusive Visuvals | Heavy Rain Lashes Hyderabad City : భారీ వర్షాలు నగరాన్ని మంచెత్తుతున్నాయి. తగ్గిపోతుందని అనుకున్న క్రమంలో..భారీ వర్షం కుమ్మేసింది. లోతట్టు ప్రాంతలకు వరద నీరు పోటెత్తింది. ఎంతలా అంటే..భారీ వాహనలు కొట్టుకపోయాయి. చిక్కుకున్న వారిని కొంతమంది రక్షించారు. గుర్రంగూడ ప్రాంతం సముద్రంలా తలపించింది. నిలిచిన ఆటోలు, కార్లు కొట్టుకపోయాయి.నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలువురు కిందపడిపోతున్న వారిని స్థానికులు రక్షించారు.వనస్థలిపురం ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఉఫ్పల్, ఘట్ కేసర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బండ్లగూడలో వర్షం మొదలైన మూడు గంటల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరద నీటితో కాలనీలు, బస్తీలు ప్రమాదంలో పడ్డాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందనే భయం వారిలో నెలకొంది. వనస్థలిపురం, ఎల్ బినగర్, ఉప్పల్, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, అత్తాపూర్, మెహిదిపట్నం, ఆరాంఘర్ చౌరస్తా, మలక్ పేట యశోదా ఆసుపత్రి సమీపంలో ఒకరు, అరుంధతినగర్ మరో బాలుడు కరెంటు షాక్ తో చనిపోయారు. అనేక కాలనీల్లో కరెంటు నిలిచిపోయింది.హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో మళ్లీ మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది.
మలక్ పేట – కోఠి మధ్య నిలిచిపోయిన వాహనాలు.
మూసారాం బాగ్ వంతెనపై రాకపోకలు నిషేధం.
దిల్ సుఖ్ నగర్ లో చెరువులను తలపిస్తున్న రోడ్లు.
మలక్ పేట వద్ద నడుం లోతులో ప్రవహిస్తున్న వరద.
చైతన్యపురిలో రోడ్లను ముంచెత్తిన వరద.
దిల్ సుఖ్ నగర్ లో ఉధృతంగా వరద.

Related Posts