లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి…ఎయిమ్స్ డెరక్టర్ కీలక వ్యాఖ్యలు

Published

on

AIIMS director దేశంలో ఏ క్షణమైనా కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఎయిమ్స్ డెరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు డిసెంబర్ చివరి, లేదా జనవరి ప్రారంభం నాటికల్లా భారతీయ రెగ్యులేటరీ అథారిటీలు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిస్తాయని గులేరియా విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రస్తుతం భారత్ లో పలు వ్యాక్సిన్ లు చివరి ట్రయిల్ దశలో ఉన్నాయని ఇవాళ ఓ ఇంటర్వ్యూలో గులేరియా తెలిపారు. అంతేకాకుండా, ఈ వ్యాక్సిన్ లు సురక్షితమే అనే మంచి డేటా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సేఫ్టీ,సామర్థ్యంలో ఎక్కడా కాంప్రమైజ్ అయిన పరిస్థితులు లేవని తెలిపారు. దేశంలో 70,000-80,000మంది వాలంటీర్లకు ట్రయిల్స్ సమయంలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని,ఎక్కడా కూడా ఏ ఒక్కరికీ తీవ్రమైన సెడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాఖలాలు లేవని చెప్పారు.కాగా,ఇటీవల క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ చెన్నై వాలంటీర్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వచ్చిన వార్తలపై గులేరియా స్పందించారు. చెన్నై కేసుకి వాక్సిన్ తో సంబంధం లేదని…ఎక్కువమందికి మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, అందులో కొంతమంది ఇతర అనారోగ్య సమస్యలు కలిగి ఉండి ఉండవచ్చని,అది వ్యాక్సిన్ కి సంబంధించిన విషయం కాదని ఆయన తెలిపారు.వ్యాక్సిన్ సరఫరాపై గులేరియా మాట్లాడుతూ…కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో యుద్ధప్రాతిపదికన దీనిపైన భారీ కసరత్తు జరుగుతోందని తెలిపారు. అయితే, ప్రారంభంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా సరిపోయినన్ని డోస్ లు అందుబాటులో ఉండవని, కరోనా కారణంగా మరణించే ప్రభావం అధికంగా కలిగిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రియారిటీ(ప్రాధాన్యత)లిస్ట్ మనం సిద్దంగా ఉంచుకోవాల్సిన అవసరముందని తెలిపారు.ప్రస్తుత కరోనా వేవ్ పై తన ఆలోచలనలు పంచుకున్న గులేరియా… ప్రస్తుత దశలో కరోనా కేసులు తగ్గుతుండటం మనం చూశామని,మనం కనుక ఖచ్చితమైన కోవిడ్-19నిబంధనలు పాటిస్తే కేసుల తగ్గుదల క్రమంగా తగ్గిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబేయే మూడు నెలలు అత్యంత కీలకమైన సమయమని,వచ్చే మూడు నెలలు మనం ఇదే పద్దతి కొనసాగిస్తే మహమ్మారికి సంబంధించి ఓ మార్పుని తీసుకురావడంలో మనం దగ్గరికి వచ్చేసినట్లేనని గులేరియా తెలిపారు.కాగా,ప్రస్తుతం దేశంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికి కోవిడ్-19 వ్యాక్సిన్ తో సహా పలు కోవిడ్ వ్యాక్సిన్ ల ట్రయిల్స్ దశలో ఉన్నాయి.ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికి కోవిడ్-19 వ్యాక్సిన్ ని పూణేకి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పతి మరియు టెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. రష్యాకి చెందిన వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ ట్రయిల్స్ కూడా భారత్ లోని రెడ్డీస్ లేబరేటరీస్ లో జరగుతున్నాయి. ఇక,ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ “కోవాగ్జిన్” దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ సురక్షితం మరియు ప్రభావవంతమైనదిగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *