#BudgetSession: నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయనున్న బీఆర్ఎస్, ఆప్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో పార్లమెంటు హౌస్ బయటే ఉంటామని బీఆర్ఎస్, ఆప్ ప్రకటించాయి.

#BudgetSession: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో పార్లమెంటు హౌస్ బయటే ఉంటామని బీఆర్ఎస్, ఆప్ ప్రకటించాయి. బీఆర్ఎస్ నేత కె.కేశవరావ్ మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాలనలో అన్ని రకాలుగా విఫలమైనందుకు నిరసనగా తాము రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తామని అన్నారు.
తమతో పాటు ఆప్ కూడా బాయ్‌కాట్‌లో పాల్గొంటుందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతి హోదాను తాము గౌరవిస్తామని, అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అందుకే తాము రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామని అన్నారు.
ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడతామని ఆ సమయంలో చెప్పారు. దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, చైనా దుందుడుకు చర్యలు వంటి అంశాలపై కేంద్ర సర్కారుని పార్లమెంటులో నిలదీస్తామని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.
Smoking hookah: పోలీస్ స్టేషన్ బయటే హుక్కా తాగుతూ వీడియో తీసుకున్న యువకుడు.. అరెస్ట్