Pakistan: పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం

పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందని అల్ అరేబియా పోస్ట్ ఓ నివేదకలో తెలిపింది. ముఖ్యంగా కొన్ని వారాల్లోగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ పాక్ కు సాయాన్ని పునరుద్ధరించకపోతే పాక్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంటుందని స్పష్టం చేసింది. పాక్ కు ఐఎంఎఫ్ రుణసాయాన్ని జారీ చేయడంలో ఆలస్యం చేస్తోంది.

Pakistan: పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం

Pakistan

Pakistan: పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందని అల్ అరేబియా పోస్ట్ ఓ నివేదకలో తెలిపింది. ముఖ్యంగా కొన్ని వారాల్లోగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ పాక్ కు సాయాన్ని పునరుద్ధరించకపోతే పాక్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంటుందని స్పష్టం చేసింది. పాక్ కు ఐఎంఎఫ్ 24వ రుణసాయాన్ని చేయడంలో ఆలస్యం చేస్తోంది.

అంతేగాక, సౌదీ అరేబియా, యూఏఈ కూడా పాక్ కు ఇక సాయం చేయబోమంటూ హెచ్చరికలు చేస్తున్నాయి. పాకిస్థాన్ సంస్కరణలను ప్రవేశపెట్టి, వాటిని అమలు చేయాల్సిందేనని నివేదిక స్పష్టం చేసింది. ఈ సందేశాన్నే ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కు గల్ఫ్ దేశాలు చెప్పాయని తెలిపింది.

పాకిస్థాన్ లో కుటిల రాజకీయాల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. పాకిస్థాన్ తమ పాలసీల్లో మార్పులు చేయాల్సి ఉందని, అయితే, అందుకు పాక్ లోని ఏ నాయకుడూ సుముఖంగా లేరని నివేదిక తెలిపింది. పాకిస్థాన్ లో ఆర్థిక అస్థిరత నెలకొనే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ కూడా రెండు రోజుల క్రితమే తెలిపారు.

పాక్ తీరు వల్ల ఐఎంఎఫ్ కొన్ని నెలలుగా రుణాన్ని మంజూరు చేయట్లేదు. పాక్ లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది వచ్చిన వరదలతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. గోధుమ పిండి కోసం పాక్ ప్రజలు ఘర్షణలకు దిగే పరిస్థితి వచ్చింది.

Mrunal Thakur : అటు మోడ్రన్.. ఇటు ట్రెడిషినల్.. క్యూట్ లుక్స్‌తో మృణాల్..