#KingCharlesIII: ప్రిన్స్ ఛార్లెస్ ఇకపై కింగ్ ఛార్లెస్.. బాధ్యతలు స్వీకరించిన ఎలిజబెత్‌-II కుమారుడు

బ్రిటన్ రాజుగా ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎలిజబెత్‌-II రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆక్సెషన్ కౌన్సిల్’ సభ్యులు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ను రాజుగా ప్రకటించారు. దీంతో ఆయన ఇకపై కింగ్ చార్లెస్-III పేరుతో కొనసాగనున్నారు. దీంతో ఛార్లెస్ సతీమణి కెమిల్లాకు రాణి హోదా వచ్చింది.

#KingCharlesIII: ప్రిన్స్ ఛార్లెస్ ఇకపై కింగ్ ఛార్లెస్.. బాధ్యతలు స్వీకరించిన ఎలిజబెత్‌-II కుమారుడు

#KingCharlesIII

#KingCharlesIII: బ్రిటన్ రాజుగా ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎలిజబెత్‌-II రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆక్సెషన్ కౌన్సిల్’ సభ్యులు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ను రాజుగా ప్రకటించారు. దీంతో ఆయన ఇకపై కింగ్ చార్లెస్-III పేరుతో కొనసాగనున్నారు. దీంతో ఛార్లెస్ సతీమణి కెమిల్లాకు రాణి హోదా వచ్చింది.

కోహినూర్‌ ఉన్న కిరీటం కెమిల్లా ధరించే అవకాశం ఉంది. ఈ ఏడాది 70 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో బ్రిటన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లోనూ ప్రసంగించిన ఎలిజబెత్‌-II తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి అని తెలిపిన విషయం విదితమే. కాగా, ప్రిన్స్ ఛార్లెస్ దేశ వ్యాప్త పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఎలిజబెత్‌-II మృతి చెందిన 10 రోజుల వరకు ఆమె అంత్యక్రియలు నిర్వహించరు.

సెప్టెంబరు 19న అంత్యక్రియలు జరుగుతాయని ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఆ సమయంలో రాణి పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచుతారు. మరోవైపు, బకింగ్‌హామ్ ప్యాలెస్ కు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. అక్కడ గేట్ల వద్ద పుష్పాలు ఉంచి ఎలిజబెత్‌-IIకు నివాళులు అర్పిస్తున్నారు.

Asaduddin Owaisi slams nitish kumar: ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తోన్న నితీశ్, మమతపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు