విశ్లేషణ: బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు, చైనా బోర్డర్‌లో మళ్లీ టెంపరేచర్ పెరుగుతోందా?

విశ్లేషణ: బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు, చైనా బోర్డర్‌లో మళ్లీ టెంపరేచర్ పెరుగుతోందా?

The India-China border dispute, explained: భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగిపోయింది. రెండు దేశాల బలగాలు.. క్లాష్ పాయింట్ నుంచి దూరంగా వచ్చేశాయ్. బఫర్ జోన్ ఏర్పాటైంది. ఇవన్నీ విని బోర్డర్‌‌లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయ్ అనుకున్నారంతా. కానీ.. సరిహద్దుకు అవతల ఉన్నది ఇండియా కాదు. జిత్తులమారి చైనా. అందుకే.. సరిహద్దుల్లో ప్రతిష్టంభన అలాగే ఉంది. LACలో.. డ్రాగన్ మళ్లీ కవ్విస్తోంది. అందుకే.. బోర్డర్‌లో మళ్లీ టెంపరేచర్ పెరుగుతోంది.
లద్దాఖ్ సిచ్యువేషన్‌లో మార్పు లేదు. చైనా తీరులో ఛేంజ్ లేదు. అందుకే.. చర్చలు జరుగుతున్నాయ్ తప్ప.. చైనా బలగాలు బోర్డర్ నుంచి జరగడం లేదు.

సరిహద్దుల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతున్న టైంలోనే.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. బిపిన్ రావత్ నుంచి ఓ స్టేట్‌మెంట్ వచ్చింది. చైనా విషయంలో.. సైనిక చర్యకైనా సిద్ధమంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతా సైలెంట్‌గా ఉన్న టైంలో.. సడన్‌గా రావత్ ఇలాంటి వార్ బెల్ మోగించడానికి రీజనేంటి? అసలేం జరుగుతోంది.. చైనా బోర్డర్‌లో?

సద్దుమణిగిందనుకున్న వివాదం.. ఇంకా అలా స్తబ్దుగానే ఉంది. భారత్-చైనా మధ్య బోర్డర్ క్లాష్.. సైలెంట్‌గా కంటిన్యూ అవుతోంది. LAC నుంచి బలగాల ఉపసంహరణ విషయంలో చైనా వెనక్కి తగ్గడం లేదు. పైగా.. భారత్‌ను కవ్వించేందుకు ట్రై చేస్తోంది. అందుకే.. డ్రాగన్ కంట్రీకి.. ఇండియా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దు విషయంలో.. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లద్దాఖ్‌లోని.. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా అతిక్రమణలను అడ్డుకునేందుకు.. సైనిక చర్యకు సైతం వెనుకాడబోమంటూ ఆయన హెచ్చరించారు.

ఇండో-చైనా బోర్డర్‌లో.. బలగాల ఉపసంహరణకు చర్చలు జరుగుతున్నప్పటికీ.. డ్రాగన్ మాత్రం తన బలగాలను వెనక్కి తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. రావత్ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్‌గా మారింది. రెండు దేశాల సైన్యం మధ్య చర్చలు, దౌత్య మార్గం ద్వారా ఫలితం లేనప్పుడు.. మిలటరీ ఆప్షన్ ఉపయోగిస్తామని బిపిన్ రావత్ తెలిపారు. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనలను నిరోధించడానికి.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. LAC వెంబడి యధాతథ స్థితిని పునరుద్ధరించేందుకు తీసుకుంటున్న చర్యలన్నీ ఫెయిలైతే.. రక్షణ బలగాలు సన్నద్ధంగా ఉన్నాయని రావత్ తెలిపారు.

భారత్-చైనా సరిహద్దుల్లో.. సైనికల బలగాల ఉపసంహరణపై రెండున్నర నెలలుగా.. అనేక సార్లు మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు జరిగాయ్. కానీ.. ఈ భేటీలో చెప్పుకోదగ్గ ఫలితం రావడం లేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యూ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ తర్వాత.. బలగాల ఉపసంహరణ ప్రక్రియ జులై 6న ప్రారంభమైంది. కానీ.. కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాసెస్ ముందుకు సాగలేదు. బలగాల ఉపసంహరణ విషయంలో.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సీరియస్‌గా లేదని తెలుస్తోంది.

2020 ఏప్రిల్ నాటి యధాతథ స్థితిని.. చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబట్టింది. అందుకోసం పీఎల్ఏపై బాగా ఒత్తిడి తెచ్చింది. కానీ.. సైనిక చర్చల్లో దీనిపై ప్రతిష్టంభన తలెత్తింది. చైనా ఆర్మీ.. LACని మార్చేయడం కరెక్ట్ కాదని.. ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.

ఐతే.. చర్చల తర్వాత గల్వాన్ లోయ, ఇతర ప్రదేశాల నుంచి చైనా సైన్యం వెనక్కి మళ్లింది. కానీ పాంగాంగ్ సో, డెప్సాంగ్, ఇతర ప్రాంతాల నుంచి.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెనక్కి వెళ్లడం లేదని తెలుస్తోది. ఇప్పటివరకు 5 సార్లకు పైనే కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చైనా.. తన బలగాలను పూర్తిగతా ఉపసంహరించాలని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ.. డ్రాగన్ ఆర్మీ తీరులో మార్పు కనిపించడం లేదు.

చైనా ఆర్మీ తీరుపై.. సీడీఎస్ బిపిన్ రావత్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అందుకే.. తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో.. చైనా అతిక్రమణలను తిప్పికొట్టేందుకు.. ఇండియన్ ఆర్మీ పక్కా ప్లాన్‌తో రెడీగా ఉందని చెప్పారు. డ్రాగన్ ఆర్మీని ఎదుర్కొనేందుకు.. మిలటరీ యాక్షన్ ప్రతిపాదన తమ దగ్గర సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. ఎల్ఏసీ వెంట.. యధాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్ని వివాదాన్ని పరిష్కరించేందుకు.. రక్షణంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని చెప్పారు సీడీఎస్.

ఐతే.. సీడీఎస్ సడన్‌గా వార్ బెల్ మోగించడంతో.. ఇప్పుడు అందరిలోనూ కొత్త సందేహాలు తలెత్తుతున్నాయ్. ఉన్నట్టుండి.. బిపిన్ రావత్ ఎందుకు మిలటరీ యాక్షన్ గురించి ప్రస్తావించారనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్ డైరెక్ట్‌గా.. యుద్ధం వస్తుందనే సంకేతాలేమైనా ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. డ్రాగన్ ఇలాగే తోకజాడిస్తే.. సరిహద్దుల్లో గట్టి కౌంటర్ తప్పదని ముందే హింట్ ఇచ్చారా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయ్.

అంతేకాదు.. శీతాకాలంలో లద్దాఖ్‌లో భారీగా బలగాల మోహరింపు కష్టమవుతుంది. అందుకే.. చైనాను కట్టడి చేసేందుకు.. తూర్పు లద్దాఖ్‌లోని కీలక ప్రాంతాల్లో.. చలి కాలంలోనూ ఇదే స్థాయిలో బలగాలను మోహరించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. చైనా బలగాలు దుందుడుకుగా వ్యవహరిస్తే.. దీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని.. సీడీఎస్ బిపిన్ రావత్ డైరెక్ట్‌గానే హెచ్చరించారు..