United Kingdom PM race: భారత సంత‌తి నేత రిషి సునక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలిన వైనం

బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి తుది రేసులో నిలిచిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు రిషి సునక్ కు మద్దతుగా నిలిచిన కేబినెట్ సీనియర్ మంత్రి సర్ రాబర్ట్ బక్లాండ్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని లిజ్ ట్రస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వి కోసం జరుగుతోన్న ఎన్నికల్లో రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే.

United Kingdom PM race: భారత సంత‌తి నేత రిషి సునక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలిన వైనం

UK PM Election 2022 Liz Truss' victory over Rishi Sunak

United Kingdom PM race: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి తుది రేసులో నిలిచిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు రిషి సునక్ కు మద్దతుగా నిలిచిన కేబినెట్ సీనియర్ మంత్రి సర్ రాబర్ట్ బక్లాండ్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని లిజ్ ట్రస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వి కోసం జరుగుతోన్న ఎన్నికల్లో రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే.

లిజ్‌ ట్రస్ కు రిషి సునక్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ మంత్రి సర్ రాబర్ట్ బక్లాండ్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజాగా, సర్ రాబర్ట్ బక్లాండ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దేశాన్ని ముందుకు నడిపించడానికి లిజ్ ట్రస్ సరైన వ్యక్తని ఇప్పుడు తాను భావిస్తున్నట్లు చెప్పారు. యూకే అభివృద్ధి కోసం ఆమె వేసుకున్న ప్రణాళికలు బాగున్నాయని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ కొనసాగుతోన్న వేళ తాను తుది పోరులో నిలిచిన లిజ్ ట్రస్, రిషి సునక్ ల ప్రసంగాలు పూర్తిగా విన్నానని చెప్పారు.

ఇప్పుడు తన మనసు మార్చుకున్నానని, దేశాన్ని ముందుకు నడిపించడానికి లిజ్ రస్ సరైన నాయకురాలని భావిస్తున్నానని తెలిపారు. తాను కేబినెట్ లో, ప్రభుత్వంలో లిజ్ రస్, రిషి సునక్ ఇద్దరితో కలిసి పనిచేశానని, తాను వారి ఆలోచనలు, ఆదర్శాలను మొదట చూస్తానని చెప్పారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి తుది రేసులో నిలిచిన లిజ్ ట్రస్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని పలు సర్వేలు తేల్చాయి. ఈ నేపథ్యంలో రిషి సునక్ కు రాబర్ట్ బక్లాండ్ మద్దతును ఉపసంహరించుకుని, లిజ్ ట్రస్ కు మద్దతు ప్రకటించడం గమనార్హం.

FBI raids on Trump’s home: ట్రంప్ ఇంటి నుంచి రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు