సికింద్రాబాద్ లో పేలుడు : కెమికల్ డబ్బాతోనే ప్రమాదం, ప్రజలు భయపడవద్దు – డీసీపీ శ్రీనివాస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Explosion in Secunderabad : సికింద్రాబాద్ లో పేలుడు..కెమికల్ డబ్బాతోనే ప్రమాదం, ప్రజలు భయపడవద్దు. సికింద్రాబాద్‌ మార్కెట్ పీఎస్ పరిధిలో పేలుడు సంభవించిందన్న సమాచారం కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించాయి.పేలుడుకు కారణాలపై ఆధారాలు సేకరించాయి. కెమికల్‌ డబ్బాను నేలకేసి కొట్టడంతోనే పేలుడు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయడం జరిగిందని నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కెమికల్ డబ్బాను నేలకేసి కొట్టడంతోనే పేలుడు సంభవించిందని తెలిపారు. ప్రజలు భయపడవద్దని సూచించారు.2020, అక్టోబర్ 25వ తేదీ ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లో పేలుడు కలకలం రేపింది. రైల్వేస్టేషన్‌ సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం దగ్గరున్న చెత్త డబ్బలో చెత్త ఏరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడు తీవ్రతతో బాధితుడి బొటనవేలు తెగిపడిపోయింది.

Related Tags :

Related Posts :