లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పంచాయతీ ఎన్నికల ఫలితంపై టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ..30 బైక్‌లు, 15 ఆటోలు, ఇళ్లు ధ్వంసం

Published

on

Extreme tension in Srikakulam : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల ఫలితం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ దారి తీసింది. చిల్లపేట రాజాంలో ముందుగా టీడీపీ గెలిచినట్లు ప్రచారం జరిగింది. రీ కౌంటింగ్ లో వైసీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించడంతో ఇరువర్గాల రెండు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన గొడవ విధ్వంసానికి దారితీసింది.

బైక్‌లు, ఆటోలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సమీపంలోని తోటల్లోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. చిల్లపేట రాజాం నిర్మానుష్యంగా మారింది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.