లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కళ్లద్దాలు ధరించేవారిలో కరోనా వచ్చే అవకాశాలు మూడింతలు తక్కువ : కొత్త అధ్యయనం

Updated On - 12:43 pm, Mon, 22 February 21

Glasses wearers up to three less likely to catch coronavirus : కళ్లద్దాలు ధరించేవారిలో కరోనా సోకే అవకాశాలు మూడింతలు తక్కువగా ఉంటాయని ఇండియాకు చెందిన ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముక్కు లేదా నోరు, కళ్లను తాకడం ద్వారా కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే కళ్లకు అద్దాలు ధరించినవారిలో నేరుగా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం లేదంటున్నారు. ఒకవేళ కళ్లకు అద్దాలు లేని పక్షంలో చేతులతో కళ్లను రుద్దడం ద్వారా కరోనా సోకే ముప్పు అధికంగా ఉంటుందని అధ్యయనంలో రుజువైంది.

medRxiv అనే వెబ్ సైటులో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రీసెర్చర్లు గత వేసవిలో ఆస్పత్రిలో చేరిన (223 మంది పురుషులు, 81మంది మహిళలు) 304 మందిపై రెండు వారాల పాటు అధ్యయనం చేశారు. కరోనా లక్షణాలు కలిగిన వారి వయస్సు 10ఏళ్ల నుంచి 80ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిలో 19శాతం మంది ఎక్కువ సమయం కళ్లద్దాలు ధరించినవారే ఉన్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ప్రతి గంటలకు సగటున తమ ముఖాన్ని 23 సార్లు తాకగా, సగటున గంటకు మూడింతలు కళ్లను తాకినట్టు నిర్ధారించారు. అయితే వీరిలో కళ్లద్దాలు ధరించిన వారిలో కరోనా రెండు నుంచి మూడింతలు తక్కువగా ముప్పు ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు.

కళ్లను రుద్దడంతో పాటు తాకడం ద్వారా కరోనా సోకడానికి ఇదొక మార్గమని నివేదికలో వెల్లడించారు. దీర్ఘకాలం కళ్లద్దాలను ధరించినవారు తమ కళ్లను పదేపదే తాకడం లేదా రుద్దడం వంటి చర్యలను అడ్డుకోవచ్చునని గుర్తించారు.