కొత్త డేంజర్‌ : కరోనాకు వాడే మందులతో కంటిచూపుపై ఎఫెక్ట్.. డాక్టర్ల హెచ్చరిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Steroids for Covid-19 Medicines : కరోనా వచ్చి పోయింది ఇక పర్వాలేదు అనుకుంటున్నవారికి మరో కొత్త సవాల్ ఎదురవుతోంది. కరోనాను తగ్గించడానికి వాడే మందులతోనే వారికి కొత్త ఇబ్బంది తలెత్తుతున్నాయని.. వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాకి వాడే మెడిసిన్స్‌లో ఎక్కువగా స్టెరాయిడ్స్ ఉంటున్నాయని.. వాటి వల్ల కంటి చూపు మందగిస్తోందని చెబుతున్నారు కంటి వైద్యులు.కొన్ని స్టెరాయిడ్స్‌కు దీర్ఘకాలిక సమస్యలు తీసుకు వచ్చే గుణం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లుగానే.. కొన్ని మందులలో కరోనాను తగ్గించే గుణంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. కంటికి ఏమాత్రం సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కోరుతున్నారు.కరోనా వచ్చిన వారిలో స్టెరాయిడ్స్ (Steroids for Coronavirus Treatment) ఇవ్వడం వల్ల వచ్చే సమస్యలు కంటిమీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. కొన్ని సార్లు రక్త నాళం మూసుకుపోవడం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధిగ్రస్తుల్లో కరోనా వచ్చి వారికి స్టెరాయిడ్స్ ఇస్తే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని చెబుతున్నారు.
Steroids for Coronavirus Treatment

లంగ్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు కరోనా వచ్చినవారికి స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. స్టెరాయిడ్స్ వాడటం ద్వారా జీవతకాలాన్ని పెంచుకోవచ్చు.. కరోనా నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుందని, కానీ, దీని తాలుకూ దుష్ఫ్రభావాలు మాత్రం అధికంగా ఉంటాయని చెబుతున్నారు.కంటిచూపు మందగించకుండా ఉండేందుకు వీలుగా స్టెరాయిడ్స్ వాడుతుండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో కరోనాకు స్టెరాయిడ్స్ వాడితే మాత్రం వారిలో డోస్ తగ్గించేలా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఏదిఏమైనా స్టెయిరాడ్ తీసుకున్నవారిలో ఎవరైనా కోలుకున్నవెంటనే వీలైనంత తొందరగా కంటి డాక్టరును సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే కంటి సమస్యలు తీవ్రమై చూపు మందగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Related Posts