కరోనా వ్యాక్సిన్ కంటే ఫేస్ మాస్క్‌ బెస్ట, టీకా వచ్చినా మాస్క్ మస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని ఖతం చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని టీకా తయారు చేస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. దీంతో, హమ్మయ్య, ఇక భయం లేదని జనాలు రిలాక్స్ అయ్యారు. వ్యాక్సిన్ వస్తే కరోనా నుంచి రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు అప్పుడే మాస్కులు తీసిపారేశారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత గురించి మర్చిపోయారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఇక మాస్కుతో పనేముంది అని వాటిని విసిరిపారేస్తున్నారు. మాస్కు లేకుండానే స్వేచ్చగా వీధుల్లో తిరుగుతున్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్ వచ్చినా.. ఫేస్ మాస్కులు ధరించడం మస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, కరోనా టీకా కంటే ఫేస్ మాస్కులు మెరుగైన రక్షణ ఇస్తాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తేల్చారు.

ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా కరోనా వ్యాక్సిన్ కంటే ఫేస్ మాస్క్‌లు మెరుగైన రక్షణను అందిస్తాయని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ తెలిపారు. COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌కు వ్యతిరేకంగా ఫేస్ మాస్క్‌లను “అత్యంత శక్తివంతమైన ప్రజారోగ్య సాధనం”గా రెడ్ ఫీల్డ్ అభివర్ణించారు.

“మాస్కులు ఏ విధంగా పని చేస్తాయన్న దాని గురించి మా దగ్గర స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఫేస్ మాస్కులు ఉత్తమ రక్షణ ఇస్తాయి. నేను టీకా తీసుకున్న దానికంటే కోవిడ్ -19 నుండి రక్షించడానికి ఈ ఫేస్ మాస్క్ మరింత హామీ ఇస్తుందని నేను చెప్పగలను” అని సెనేట్ సబ్ కమిటీ విచారణ సందర్భంగా అమెరికన్ చట్టసభ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ రెడ్‌ఫీల్డ్ ఈ విషయం చెప్పారు.

వచ్చే ఏడాది(2021) “రెండవ త్రైమాసికం చివరిలో లేదా మూడవ త్రైమాసికం” నాటికి అమెరికాలో కరోనా టీకా విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రెడ్ ఫీల్డ్ అభిప్రాయపడ్డారు. అమెరికన్లందరికి సంపూర్ణంగా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పండి అని ఎవరైనా నన్ను అడిగితే, వచ్చే ఏడాది మూడవ త్రైమాసికం అనుకుంటున్నా” అని రెడ్‌ఫీల్డ్ చెప్పారు.

కాగా, టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కచ్చితంగా ఫేస్ మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు రెడ్ ఫీల్డ్. ఫేస్ మాస్క్‌లు ధరించడానికి సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించి, విశ్వవ్యాప్తంగా అవలంభిస్తే కరోనావైరస్ మహమ్మారిని త్వరగానే అదుపులోకి తీసుకురాగలమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే గైడ్ లైన్స్ ను అప్‌డేట్ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కచ్చితంగా ఫ్యాబ్రిక్ ఫేస్ మాస్క్‌లు ధరించేలా తమ ప్రజలకు ఆదేశాలు ఇవ్వాలని అన్ని దేశాల ప్రభుత్వాలకు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఆ విధంగా చెయ్యడం వల్ల కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి సాయపడుతుందని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడానికి ఏకైక సాధనం ఫేస్ మాస్కులే అని ఇటీవల నిర్వహించిన పలు అధ్యయనాల్లో తేలిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

3కోట్లకు చేరువలో కరోనా కేసులు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే గైడ్ లైన్స్ ను అప్‌డేట్ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కచ్చితంగా ఫ్యాబ్రిక్ ఫేస్ మాస్క్‌లు ధరించేలా తమ ప్రజలకు ఆదేశాలు ఇవ్వాలని అన్ని దేశాల ప్రభుత్వాలకు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఆ విధంగా చెయ్యడం వల్ల కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి సాయపడుతుందని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడానికి ఏకైక సాధనం ఫేస్ మాస్కులే అని ఇటీవల నిర్వహించిన పలు అధ్యయనాల్లో తేలిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

READ  ఒకరి నుంచి 9 మందికి : రెస్టారెంట్‌లో ఏసీ గాలి ద్వారా 3 ఫ్యామిలీలకు కరోనా సోకింది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3కోట్లకు చేరువలో ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 9.37 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9లక్షల 37వేల 111 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2 కోట్ల 96 లక్షల 74 వేల 788గా ఉంది. గురువారం(సెప్టెంబర్ 17,2020) లేదా శుక్రవారం(సెప్టెంబర్ 18,2020) ఈ సంఖ్య 3 కోట్లను దాటే అవకాశం ఉంది.
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మందికి పైగా కోలుకున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసుల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో 68 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. భారత్‌లో కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది.

ఇక బ్రెజిల్, రష్యా, పెరూ దేశాలు ఆ తర్వాతి మూడు స్థానాల్లో నిలిచాయి. మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ మాత్రమే ఉన్నాయి. బ్రెజిల్‌లో మరణాల సంఖ్య లక్షా 34 వేలు దాటితే.. అమెరికాలో ఈ సంఖ్య రెండు లక్షలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల కరోనా మరణాలు నమోదైన దేశంగా అమెరికా మాత్రమే ఉంది. ఇక ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఏడాది చివరినాటికి సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లోని వివిధ కంపెనీలు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి.


Related Posts