ట్రంప్ కు ఫేస్ బుక్ షాక్…తప్పుడు పోస్ట్ చేశారంటూ డిలీట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంటున్నవిషయం తెలిసిందే.కరోనా వైరస్‌ విషయంలో భయాన్ని సృష్టిస్తున్న, తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వాటిని సైట్‌ నుంచి ఫేస్‌బుక్‌ వెంటనే తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియోను ఫేస్ బుక్ డిలీట్ చేసి సంచలనం సృష్టించింది.

చిన్నారుల్లో కోవిడ్ రోగ‌నిరోధ‌క‌శ‌క్తి ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియోను సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ డిలీట్ చేసింది. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ట్రంప్.. కోవిడ్ వ్యాధి పిల్ల‌ల‌కు సోక‌ద‌న్న ఓ అభిప్రాయాన్ని ఆయ‌న తెలిపారు. ఆ కామెంట్ ఉన్న వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.క‌రోనా వైర‌స్ ప‌ట్ల త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంద‌న్న కార‌ణంతో ఫేస్‌బుక్ సంస్థ ఆ పోస్టును డిలీట్ చేసింది. అయితే, తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కరోనా వైరస్‌పై డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్‌ పేర్కొంది. అందుకే ఆయన పోస్ట్‌ను తొలగించినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ గురించి ట్రంప్‌ ఇచ్చిన సమాచారం హానికరమని, అందుకే ఈ పోస్టును తొలగించామని ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించింది. కాగాఇటీవల కాలంలో ట్రంప్ చేసిన కొన్ని ట్వీట్ లను కూడా ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే.


Related Posts