Home » ఫేస్బుక్లో కొత్త రీడిజైన్.. ఇక లైక్ కొట్టలేరు.. ఓన్లీ ఫాలో..!
Published
1 month agoon
Facebook Drops Like Button : ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్బుక్ పబ్లిక్ పేజీల్లో లైక్ బటన్ తొలగిస్తోంది. ఇకపై ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారు. పబ్లిక్ పేజీలను కొత్తగా రీడిజైన్ చేస్తోంది. ఆర్టిస్టులు, పబ్లిక్ ఫిగర్స్, బ్రాండ్ల పబ్లిక్ పేజీల్లో ఇకపై లైక్ బటన్ కనిపించదు. ఈ మేరకు సోషల్ మీడియా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
న్యూస్ ఫీడ్ లో మరిన్ని కన్వర్షన్లు పెంచడపైనే మరింత ఫోకస్ పెట్టింది. ఫేస్ బుక్ ఫేజీల్లో ఇకపై ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారని తెలిపింది. ఈ కొత్త రీడిజైన్ జనవరిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇటీవలే ఫేస్ బుక్ తమ బ్లాగ్ పోస్టులో పేర్కొంది.
లైక్ బటన్, ఫాలోవర్స్ బటన్ వేర్వేరుగా ఉండటంతో కాస్తా యూజర్లకు కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇప్పుడా ఆ కన్ఫ్యూజన్ కు పుల్ స్టాప్ పెట్టేసే దిశగా ఫేస్బుక్ ఫాలోవర్స్ ఆప్షన్ మాత్రమే యూజర్లకు కనిపించేలా ఈ కొత్త రీడిజైన్ ద్వారా తీసుకోస్తోంది.
ఈ ఫేక్ యాప్‌తో జాగ్రత్త.. మొత్తం దోచేస్తారు
ట్రాన్స్ జెండర్ తో ఫేసు బుక్ ప్రేమ….కట్నం కోసం వేధింపులు
వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్, మెసేజ్‌లు పంపలేరు, మే 15 నుంచి అమలు
సోషల్ మీడియాలో కంటెంట్‌కు సెన్సార్ కట్.. కేంద్రం కొత్త చట్టం!
నకిలీ ఫేస్ బుక్ ఖాతాలతో మోసాలు
వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, లక్షన్నర పొగొట్టుకున్న టెకీ