లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

ఫేస్ బుక్ ఇండియా పాలసీ హెడ్ ‘అంఖిదాస్’ రాజీనామా

Published

on

Facebook India Policy Head Quits భారత్‌లో ఫేస్‌బుక్‌ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని,హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్‌ చేసేందుకు అనుమతిస్తోందనే ఆరోపణలు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో​ తన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు ఫేస్ బుక్ ఇండియా పాలసీ హెడ్ అంఖి దాస్(49)గత నెలలో పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ కూడా చేసింది.కాగా, ఫేస్ బుక్ వివాదంలో కీలకంగా మారిన ఫేస్ బుక్ ఇండియా పాలసీ హెడ్ అంఖి దాస్ అంఖిదాస్..ఇప్పుడు తన పదవికి రాజీనామా చేశారు. ఫేస్ బుక్ ఇండియా మునేజింగ్ డైరక్టర్ అజిత్ మోహన్ ఈ మేరకు మంగళవారం(అక్టోబర్-27,2020)ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాసేవలో జీవించాలని ఉన్న ఆశక్తితో.. అంఖిదాస్ తనకు తానే స్వయంగా ఈ పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకుందని ఆ ప్రకటనలో అజిత్ మోహన్ తెలిపారు. ఆమె సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఫేస్ బుక్ సంస్థ వృద్ధిలో,గడిచిన 9ఏళ్లుగా సంస్థ సేవల్లో ఆమె పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు.మరోవైపు,సోషల్ మీడియాలో పొలిటికల్ కంటెంట్ ఏ విధంగా నియంత్రణ చేయబడుతుందనే విషయంపై భారత ప్రభుత్వంనుంచి, సంస్థ ఉద్యోగుల నుంచి అంతర్గతంగా…అంకిదాస్,ఫేస్ బుక్ కంపెనీ ప్రశ్నలను ఎదుర్కొన్న కొన్ని వారాల్లో అంకిదాస్ రాజీనామా తెరపైకి వచ్చింది. కాగా, గతవారం డేటా భ‌ద్రత అంశంలో వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019కి సంబంధించి నియమించిన పార్లమెంట్​ సంయుక్త కమిటీ ఎదుట అంఖి దాస్ హాజ‌రైన విసయం తెలిసిందే. ప్యాన‌ల్ స‌భ్యులు అంఖిని ప‌లు భ‌ద్ర‌తా అంశాల‌పై ప్ర‌శ్న‌లు వేశారు.అయితే,ఈ ఏడాది ఆగస్టులో వాల్ స్ట్రీట్ జర్నల్,టైమ్స్ మేగజైన్ తో సహా విదేశీ మీడియా పబ్లికేషన్స్… భారత్ లో విద్వేషపూరిత ప్రసంగాల రూల్స్ బీజేపీ సభ్యుల పోస్ట్ లకు వర్తించట్లేదని ఆరోపించిన విషయం తెలిసిందే. వివాదాస్పద నేతలపై ‘హేట్‌ స్పీచ్‌’ నిబంధనల కింద చర్యలు తీసుకోకుండా ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ అంకిదాస్‌ అడ్డుపడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా,విద్వేషపూరిత పోస్ట్ లను సోషల్ మీడియాలో పెట్టే బీజేపీ కార్యకర్తల విషయంలో చర్యలు తీసుకుంటే భారత్ లో ఫేస్ బుక్ సంస్థ వ్యాపారానికి నష్టం జరిగే ప్రమాదముందని అంకిదాస్ కంపెనీకి సూచించినట్లు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం భారత్ లో ఫేక్ బుక్ వాడుతున్నవారి సంఖ్య 30కోట్లకు పైమాటే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *