లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Fact Check : పాక్ పార్లమెంట్ లో ‘మోడీ’ నినాదాలు!

Published

on

Did Pakistan MPs chant ‘Modi, Modi’ inside Parliament పాకిస్తాన్ పార్లమెంటులో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు మార్మోగిందంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గురువారం పాక్ పార్లమెంట్ లో మంత్రి షా మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతున్న సమయంలో….పాకిస్తాన్ లోప్రత్యేకదేశం కోసం ఏళ్లుగా పోరాడుతున్న బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన ఎంపీలు మోడీ నినాదాలు చేసినట్లు….దీంతో విగిసిపోయిన ఖురేషి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి ఏం చేసేదిలేక కూర్చుండిపోయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోదంటూ పలు వెబ్ సైట్లు కథనాలు రాశాయి.స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సభ్యులు కూడా వారికి వంత పాడారనే కథనాలు వచ్చాయి. ఇది ఇమ్రాన్ ఖాన్ కు ఇబ్బంది అని పలువురు నెటిజన్లు కూడా అన్నారు.

అయితే అసలు జరిగింది ఇదే

పాక్ పార్లమెంటులో ఒక అంశం మీద చర్చాకార్యక్రమం నడుస్తుంది. ఆ అంశం మీద ఓటింగ్ జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందులో భాగంగానే పలువురు ఎంపీలు లేచి.. ‘ఓటింగ్.. ఓటింగ్.. ఓటింగ్’అని అరిచారు. అయితే, పలువురు…తమ తెలివితేటలను ఉపయోగించి ఈ క్లిప్ మొదట్లో ‘మోడీ.. మోడీ.. ’అని వచ్చే విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు.

ఇక పాక్ పార్లమెంట్ లో మోడీ నినాదాలు మార్మోగిపోతున్నాయి చూడండి అంటూ పలువురు సోషల్ మీడియాలో ఈ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. పలువురు బీజేపీ సీనియర్ నేతలు కూడా మోడీ నినాదాలు పాక్ పార్లమెంట్ లో మార్మోగుతున్నాయంటూ సోషల్ మోడీలో వీడియోను షేర్ చేశారు. మోడీ భారత్ కే కాదు..ప్రపంచానికే ఆదర్శం అంటూ బీజేపీ ఎంపీలు ఈ వీడియో క్లిప్ ను షేర్ చేశారు. చివరికి,ఇది ఎడిట్ చేసిన వీడియో అని తేలింది. అక్కడ ఓటింగ్ అంటే మనోళ్లు మోడీ అని ఎడిట్ చేసినట్లు తేలింది.మరోవైపు, ఎట్టకేలకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనని స్వయంగా పాకిస్తాన్ గురువారం అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో 40మంది భారత జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ దే బాధ్యత అని స్వయంగా ఆ దేశ మంత్రి పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వపు అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజంను పాక్ ప్రోత్సహిస్తున్నట్లు స్వయంగా పాక్ మంత్రే ఆ దేశ పార్లమెంట్ లో చెప్పారు.