Fact Check..Saudi Arabia Muslim Woman From Married Her Son Are Fake, Know Truth Behind The Viral Picture

కన్న కొడుకు పెళ్లి చేసుకున్న మహిళ..వైరల్ ఫోటో వెనుకున్న అసలు కధ ఏమిటంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భర్త చనిపోయాడు…కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యింది. కానీ ఈ ఫోటో వెనుక ఉన్ అసలు కథ వేరుగా ఉంది. ఆ కధ ఏమిటో తెలుసుకుందాం..

సౌదీ అరేబియాకు చెందిన మహిళ భర్త చనిపోవడంతో తన సొంత కుమారుడినే వివాహమాడిందని..దీనికి సంబంధించిన ఫొటో అంటూ ఒక తల్లి, కొడుకు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథను మహ్మద్ జుబీర్ అనే ట్విట్టర్ యూజర్ వెల్లడించారు. ఈ ఫొటోపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న విషయం ఫేక్ అని జుబీర్ స్పష్టం చేశారు. 

ఇస్లామిక్‌ క్యాప్షన్‌తో ట్వీట్ చేసిన ఈ ఫొటో కోసం తాను సోషల్ మీడియాలో ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ చేసానని.. జనవరి 31న ఈ ఫొటోలు ఒక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసినట్టు గుర్తించాననీ మహ్మద్ జుబీర్ తెలిపారు.ఈ ఫొటోకు ఉర్దూలో “ఇవాళ నా కుమారుడు ఖురాన్ పఠనం పూర్తి చేశాడు” అని క్యాప్షన్ ఉన్నట్టుగా జుబీర్ గుర్తించారు. దాన్ని తన ట్విట్టర్ లో వెల్లడించారు.

కానీ..ఈ ఫొటోను తీసుకుని ఓ నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా ‘సొంత కొడుకును పెళ్లాడిని తల్లి’ అంటూ దుష్ప్రచారం చేశారని నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేశారు. తల్లీ బిడ్డల పవిత్రమైన బంధాన్ని ఇలా ప్రచారం చేయటం దారుణమని  ఆవేదన వ్యక్తంచేశారు.

    

Related Posts