లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పెళ్లి చేయమని అడిగిన కొడుకుపై తండ్రి దాడి, మృతి

Updated On - 2:56 pm, Sun, 17 January 21

fahter kills son, due to marriage issue in rangareddy district :  రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. త్వరగా పెళ్లి చేయమని తండ్రిని విసిగిస్తున్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడిచేశాడు.  ఈ ఘటన కొత్తూరు మండలం చేగూర్‌లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, నరేష్ లు తండ్రీ కొడుకులు.

నరేష్ పెళ్లి విషయమై తండ్రీ కొడుకుల మధ్య వివాదం తలెత్తింది. తనకు తొందరగా పెళ్లి చేయాలని తండ్రిపై నరేష్ గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే విషయమై తండ్రీ కొడుకులు వాదులాడుకున్నారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఎల్లయ్య.. నరేష్ పై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నరేష్ ను స్థానికులు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నరేష్ కన్నుమూశాడు. నరేష్ పై దాడికి పాల్పడిన ఎల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.