fake currency in khammam

మీ రూ.2వేల నోటు చెక్ చేసుకోండి : ఖమ్మం జిల్లాలో రూ.7కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఖమ్మం జిల్లా నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. సత్తుపల్లిలో నకిలీ నోట్ల ముఠా రెచ్చిపోతోంది. బహిరంగంగానే నకిలీ నోట్లను చెలామణి చేస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన

ఖమ్మం జిల్లా నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. సత్తుపల్లిలో నకిలీ నోట్ల ముఠా రెచ్చిపోతోంది. బహిరంగంగానే నకిలీ నోట్లను చెలామణి చేస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు… నకిలీ నోట్ల గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. రూ.7 కోట్ల విలువ చేసే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

ఖమ్మంలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. పెద్ద మొత్తంలో 2వేల రూపాయల నోట్లను ముద్రిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి కేంద్రంగా దొంగ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌తో వారిని పట్టుకున్నారు. ఖమ్మం సి.పి తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలతో ఖమ్మం టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ట్రాఫిక్ సీఐ కరుణాకర్, సిబ్భంది కలిసి నకిలీ కరెన్సీ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని నుంచి 7కోట్ల నకిలీ నోట్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన మర్లపాడు కేంద్రంగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారు నిందితులు. చిల్డ్రన్‌ బ్యాంక్‌ పేరుతో ముద్రించిన నోట్లను చెలామణి చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. అసలు నోట్లలాగే నకిలీ నోట్లను తయారు చేసి.. జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. అసలు 2వేల రూపాయల నోట్లు 10 లక్షలు ఇస్తే 90లక్షల రూపాయలను వైట్ మనీ చేసుకోవచ్చు అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు నిందితులు.

ముఠా సూత్రధారి మదార్ మియాగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని భావిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. 

Related Posts