దొంగనోట్ల చలామణి ముఠా అరెస్టు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Fake currency : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ముగ్గురిని అంబాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువైన దొంగ నోట్లు, ఆరు సెల్ ఫోన్లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని అమలాపురం డిఎస్పీ షేక్ మాసుం భాషా తెలిపారు.
జిల్లాలోని కొత్తపేట మండలం బిళ్లకుర్రుకు చెందిన చోడే హరినాధ్ అలియాస్ హరి, అమలాపురనికి చెందిన మంచిగంటి మోహనరావు , పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామానికి చెందిన గంటి శ్రీనివాస్ ఆలియాస్ రేకుల శ్రీనులు అరెస్టైన వారిలో ఉన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని గాలించి త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ తెలిపారు.

కాగా హరినాద్ పై గతంలో కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, పెనుగొండ పోలీసు స్టేషన్లలో నకలీ నోట్ల చలామణి కేసులో ఆరు కేసులు ఉన్నాయన్నారు. రేకుల శ్రీనివాస్ పై పెరవలి, పెనుగొండ, ఆచంట, అయినవిల్లి, రావులపాలెం, అమలాపురం టౌన్, హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్, సరూర్ నగర్, లంగర్ హౌస్ పోలీసు స్టేషన్లో నకిలీ నోట్ల చలామణి కేసులో ముద్దాయి అన్నారు.
మోహన్ రావు హైదరాబాద్‌లో నకలీ నోట్ల చలామణి కేసులో ముద్దాయని డిఎస్పీ మాసు భాషా తెలిపారు. , వీరిపై 489(b), 489(c) అండర్ 34 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.


Related Posts