Fake news not easy to spot on Facebook: Study

ఫేస్‌బుక్‌పై ‘Fake News’ గుర్తించడం అంత ఈజీ కాదు : రీసెర్చ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేసేందుకు సోషల్ మీడియా దిగ్గజాలు నడుం బిగించాయి. అయినప్పటికీ ఫేక్ న్యూస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించడంలో విఫలం అవుతున్నాయి. ఏది రియల్.. ఏది ఫేక్ న్యూస్ అనేది గుర్తించలేకపోతున్నాయి. ఫేక్ న్యూస్ కారణంగా సోషల్ మీడియా దిగ్గజాలకు ఒక సవాల్ గా మారింది. తప్పుడు సమాచారాన్ని ఎలాగైనా నియంత్రించాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. 

తమ ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ దిగ్గజం ఫేస్ బుక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తిపై ఒక అధ్యయనం జరిగింది. ఎక్కువగా పొలిటికల్ రిలేటెడ్ వార్తలపై లోతుగా పరిశోధించారు. ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ప్యాట్రిసియా మోర్వెక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేతృత్వంలో 80 మంది సోషల్ మీడియా ప్రొఫిషియంట్ విద్యార్థులతో కలిసి పూర్తి చేసింది. 

ప్రధానంగా ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో నియంత్రించలేదని తెలిపింది. ఇప్పటికి ఫేక్ న్యూస్ ను గుర్తించడం కష్టంతో కూడుకున్న పనిగా పరిశోధక బృందం అభిప్రాయపడింది. సగటు వ్యక్తి కంటే ఫేక్ న్యూస్ ను సులభంగా పసిగట్టగలమని, కానీ, అదంతా సాధ్యమైన విషయం కాదని ప్రొఫెసర్ మోర్వెక్ తెలిపారు. ఫేక్ న్యూస్ కు సంబంధించిన అధ్యయనాన్ని జనరల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో ప్రచురించారు. 

ఈ అధ్యయనం కోసం రీసెర్చర్లు 80మంది సోషల్ మీడియా ప్రొఫెషియంట్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో కలిసి పనిచేశారు. దీనిపై అడిగిన 10 ప్రశ్నలకు ముందుగా విద్యార్థులే సమాధానమిచ్చారు. ప్రతి అభ్యర్థి తమ EEG హెడ్ సెట్ తో కలిసి పాల్గొన్నారు. విద్యార్థులను 50 రాజకీయ వార్తల హెడ్ లైన్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. 40 న్యూస్ హెడ్ లైన్స్ ను రియల్, ఫేక్ వార్తాలుగా విభజించారు. న్యూస్ ఫీడ్ పై కనిపించిన హెడ్ లైన్స్ చదివిన విద్యార్థులు వాటిలో ఎంత నిజం ఉందనేదానిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2016లోనే ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంపై ఫ్యాక్ట్ చెకింగ్ అనే ఫీచర్ ప్రవేశపెట్టింది. 

Related Posts