అక్రమ సంబంధాలు….. కూలుతున్న కాపురాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వివాహేతర సంబంధాలు కుటుంబాల పరువును బజారుకీడుస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. కలకాలం కలిసి ఉండాల్సిన జీవితాల్లో శోకాన్ని నింపుతున్నాయి. వివాహేతర సంబంధాలతో కుటుంబ పోషణ మరిచిన భర్తలకు భార్యలు దేహశుద్ది చేస్తున్న ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. న్యాయం చేయలంటూ పతి కోసం పత్నిలు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి జిల్లాలో అక్రమ సంబందాలు పెట్టుకున్న భర్తలకు భార్యలు చెప్పుదెబ్బలతో బుద్ది చెప్పారు.

అక్రమ సంబందాలు కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. మనుషుల ప్రాణాలను సైతం బలి తీసుకున్న ఘటనలు చాలనే ఉన్నాయి.ఏడు అడుగుల బంధాన్ని పక్కన పెట్టి… అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి జీవితాలు చివరకు విషాదంతోనే ముగుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇటివల అక్రమ సంబందాలు పెట్టుకున్న భర్తలను రెడ్ హ్యండ్ గా పట్టుకున్న ఘటనలు అందరిని ఆలోచనలో పడేసాయి…భార్య భర్తల పవిత్ర సంబందాలు ఎటు వెళ్తున్నాయన్న ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తున్నాయిమానకోండుర్ మండలానికి చెందిన యువతికి…సుల్తానాబాద్ కు చేసిన సంపత్ కు వివాహం జరిగింది. కోంత కాలం పాటు సజావుగానే సాగిన కాపురంలో కలహలు మొదలయ్యాయి. మానసను అదనపు కట్నం కోసం టార్చర్ మొదలు పెట్టిన సంపత్…భార్యకు దూరంగా ఉంటు కరీంనగర్ లో ఓ షాపులో ఉద్యోగం చేసుకుంటు జీవనం సాగించడం మొదలుపెట్టాడు. భార్యను కాపురానికి తీసుకువెళ్లాలని పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతి జరిగిన భార్యను మాత్రం కాపురానికి తీసుకెళ్లాడానికి సంపత్ నిరాకరించాడు. అనుమానం వచ్చిన భార్య మానస భర్త వివాహేతర సంబందాలు కోనసాగిస్తున్నాడని తెలుసుకుంది. షాపింగ్ మాల్ లో పని చేస్తున్న తోటి వర్కర్లను ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నడని తెలుసుకోని బంధువులతో వచ్చి సంపత్ కు దేహశుద్ది చేసింది.మరోక ఘటనలో పెద్దపల్లి జిల్లాకు చెందిన అనూష, హుస్నాబాద్ కు చెందిన హరీష్ ఇద్దరు ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. యేడాదిన్నరగా దంపతుల మద్య గోడవలు మొదలవడంతో…ఇద్దరు వేరు వేరుగా జీవనం సాగిస్తున్నారు. అయితే హరీష్ మరో యువతితో సహజీవనం సాగిస్తున్నడని తెలుసుకున్న అనూష…మంకమ్మతోటలో హరీష్ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకుంది. మరో యువతితో కలిసి ఉండడాన్ని చూసి తట్టుకోలేని అనుష భర్తకు చెప్పు దెబ్బల రుచి చూపించింది. నాకేందుకు అన్యాయం చేశావంటు..భర్తకు బడిత పూజ చేసింది.

భార్యను వద్దనుకున్న హరీష్…మరో యువతితో సహాజీవినం చేశాడు. విడాకులు తీసుకోకుండానే మరో మహిళతో కాపురం మొదలు పెట్టడంతో…ఆ యువతి ప్రస్తుతం 6 నెలల గర్బీణి. చేసెది ఏమిలేక భర్తను చితకభాది పోలిస్ లకు అప్పగించి వెళ్లింది భార్య అనుషా.ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలోను ఇటీవల వెలుగు చూసింది…పెద్దపల్లి జిల్లా సుభాష్ నగర్ కు చెందిన దేవెందర్,సౌజన్యలకు 2013లో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి 6 నెలల చిన్నారి ఉంది. అయితే కోంత కాలంగా భార్య భర్తల మధ్య అదనపు కట్నం కోసం గోడవలు జరుగుతుండగా…న్యాయం కోసం కూతరితో కలిసి సౌజన్య ఆందోళనకు దిగింది. భార్య ఆందోళనకు దిగడంతో…ఆగ్రహంతో దేవెందర్ భార్య,ఆమె బంధువుల పై విచక్షణ రహితంగా దాడికి దిగడంతో…భర్త పై భార్య పోలిస్ లకు పిర్యాదు చేసింది.

READ  తమ కుటుంబసభ్యులకే భారతరత్న రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది

Related Posts