లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

తారక్‌కి ఫైన్.. ఫ్యాన్ కట్టాడు..

Published

on

NTR Fan: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి యూత్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. అతని యాక్టింగ్ ముఖ్యంగా డ్యాన్స్‌కి విదేశాల్లోనూ అభిమానులున్నారు. తారక్‌పై వారి ప్రేమను ఇప్పటికే పలు సందర్భాల్లో వివిధ రకాలుగా వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఓ అభిమాని ఊహించని విధంగా వార్తల్లో నిలిచాడు. ఎన్టీఆర్ కట్టాల్సిన చలాన్ తాను కట్టి దానికి బదులుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్స్ ఇప్పించమని తారక్‌కి విజ్ఞప్తి చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై ఓవర్ స్పీడ్‌‌లో కారు నడిపినందుకుగానూ ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్‌కి రూ.1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఆన్‌లైన్ ద్వారా తారక్ చెల్లించాల్సిన ఫైన్ తాను చెల్లించి, ఆ స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. దానికి బదులు ‘ఆర్ఆర్ఆర్’ టికెట్స్ కావాలని అడిగాడు.

అది కూడా తానుండే కూకట్‌పల్లి ఏరియాలోని బ్రమరాంభ, మల్లిఖార్జున థియేటర్లలో ఇస్తే చక్కగా స్నేహితులతో కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి అభిమాని కోరికను ఎన్టీఆర్ తీరుస్తాడో లేదో.. అతని వినతి పట్ల ఎలా స్పందిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.