fans desire to Rashmika mandanna 

సమంత పాత్రలో చూడాలని ఉంది, రష్మికను కోరిన అభిమానులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ముద్దుగుమ్మ రష్మిక మందన ట్విటర్ లో లైవ్ లో వచ్చింది. అభిమానులతో ముచ్చటించింది. వారితో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ముద్దుగుమ్మ రష్మిక మందన ట్విటర్ లో లైవ్ లో వచ్చింది. అభిమానులతో ముచ్చటించింది. వారితో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులను రష్మిక ఓ ప్రశ్న అడిగింది. తాను ఎలాంటి పాత్రల్లో నటిస్తే చూడాలని అనుకుంటున్నారో చెప్పాలంది. దీనికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇచ్చారు. మీరు మరోసారి లిల్లీ(డియర్ కామ్రేడ్) పాత్రలో నటిస్తే చూడాలని ఉందని ఒకరు, గీత (గీత గోవిందం) పాత్ర మీకు బాగా నప్పుతుందని మరొకరు, హారర్ చిత్రాల్లో నటించండని ఇంకొకరు చెప్పారు. కాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత పోషించిన గీత పాత్ర లాంటి క్యూట్ రోల్ మీకు బాగుంటుంది, అలాంటివి చేయండని ఎక్కువమంది కామెంట్లు చేశారు.

కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రంతో రష్మిక హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అదే ఏడాదిలో విడుదలైన గీత గోవిందం చిత్రం రష్మికు మంచి పేరు తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. 2019లో డియర్ కామ్రేడ్ చిత్రంతో విజయ్-రష్మిక జంట మరోసారి ప్రేక్షకులను అలరించింది. 2020లో సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలు ఆమెకు మంచి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప చిత్రంతోపాటు తమిళ, కన్నడ చిత్రాలు ఉన్నాయి. బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read:  బాలీవుడ్ టు టాలీవుడ్ : ప్రభాస్ సరసన దీపికా పడుకోన్!

Related Posts