farm-bills-protection-shield-for-farmers-opposition-misleading-them-pm-modi1

వ్యవసాయ బిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కొత్త బిల్లులపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ మూడు కొత్త బిల్లుల వల్ల రైతులకు స్వేచ్ఛ లభిస్తుందని ప్రధాని అన్నారు. కానీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కొందరు.. ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

బిల్లులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మోడీ తెలిపారు. వీటితో అన్నదాతలకు స్వేచ్ఛ లభిస్తుందని ఆభిప్రాయపడ్డారు. మధ్యవర్తుల నుంచి రైతులను ఈ బిల్లులు కాపాడతాయని చెప్పారు.


బిహార్​లోని వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, బీహార్ లో రూ.3వేల కోట్లతో నిర్మించిన పలు రైల్వే, విద్యుత్​ ప్రాజెక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోడీ ప్రారంభించారు. అనంతరం కోసి రైల్​ మెగా వంతెనను జాతికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల వల్ల బిహార్​ రైల్వే వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో పాటు బంగాల్​- తూర్పు భారత రైల్వే వ్యవస్థ కూడా అనుసంధానమవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో బీహార్ వాసుల 86ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ఈ సందర్భంగా బీహార్‌లో రైలు కనెక్టివిటీ రంగంలో కొత్త చరిత్ర సృష్టించబడిందని ప్రధాని మోడీ అన్నారు.

Related Posts