లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

రైతు ఆందోళనలపై పీఎం మోడీతో మాట్లాడమని బోరిస్ జాన్సన్‌ను అడుగుతున్న ఎంపీలు

Published

on

UK-PM-Boris-Johnson

Boris Johnson: యూకే పార్లమెంట్‍‌కు చెందిన 100మంది ఎంపీలు.. ఆ దేశ ప్రధానిని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనలపై భారత ప్రధాని మోడీతో మాట్లాడాలంటూ లేఖ రాశారు. ఇండియాలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు. జనవరి 5న యూకే లేబర్ పార్టీ ఎంపీ తన్మన్‌జిత్ సింగ్ దేవీ శుక్రవారం ఈ లెటర్ ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

దీనిని బట్టే యూకేలో ఉన్న ఇండియన్లు ఎక్కువగా పంజాబ్ తో సంబంధాలు ఉన్నవాళ్లే. ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై టియర్ గ్యాస్, వాటర్ గన్ లు ఉపయోగించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.

రిపబ్లిక్ డేకు బోరిస్ జాన్సన్ ఇండియాకు రావాల్సి ఉండగా.. దానిని క్యాన్సిల్ చేశారు. దీంతో ఇప్పుడు కాకుండా మరోసారి కలిసినప్పుడు దీనిపై చర్చించాలని విన్నవించారు బ్రిటీష్ ఎంపీలు. ‘మ్యాటర్‌పై ఉన్న అర్జెన్సీను బట్టి.. మేమంతా కలిసి మీకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. ఇండియన్ పీఎంకు మా విన్నపాన్ని తెలియజేయండి. ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా నిరసన తెలియజేసే హక్కు లేదా.. దీనిపై వేగంగా రిసొల్యూషన్ వస్తుందనుకుంటున్నాం. అని లెటర్ లో రాశారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 47వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా సింఘు సరిహద్దుల్లో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల రైతు అమరీందర్ సింగ్ సింఘు సరిహద్దుల్లో విషం తాగాడు. సోనిపట్ ఫిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమరీందర్ సంగ్ చనిపోయాడు. ఇప్పటిదాకా 60 మందికి పైగా రైతులు ఉద్యమంలో చనిపోయారు.

అటు సింఘు, టిక్రి, ఘాజీపూర్, చిల్లా సరిహద్దుల్లో…ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎనిమిదో విడత చర్చలు కూడా విఫలమవడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. జనవరి 13,14 తేదీల్లో భోగి, మకర సంక్రాంతి సందర్భంగా సాగుచట్టాల ప్రతులను దహనం చేస్తామని రైతులు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన మహిళా కిసాన్ దివస్ పేరుతో, 23వ తేదీన నేతాజీ జయంతి సందర్భంగా ఆజాద్ కిసాన్ పేరుతో ఆందోళనలు చేపడతామని తెలిపారు.

ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అటు రైతుల డిమాండ్లపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని రైతులకు స్పష్టం చేసింది కేంద్రం. వ్యవసాయ చట్టాల రద్దు, రైతుల ఆందోళన పిటిషన్లపై 2021, జనవరి 11వ తేదీ సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.