లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సాగు చట్టాలపై పోరాడుతున్న అన్నదాతలకు బ్రిటన్ రైతుల సంఘీభావం

Updated On - 7:36 pm, Tue, 26 January 21

Farmers across UK  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో 60 రోజులగా అన్నదాతలు చేస్తోన్న నిరసనకు బ్రిటన్ రైతులు సంఘీభావం తెలిపారు. భారతీయ రైతులకు సంఘీభావం తెలుపుతూ బ్రిటన్ నలుమూలలనుంచి రైతులు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు.

భారతీయ రైతుల ఆందోళనకు తాము సంఘీభావం తెలుపుతున్నామని..వ్యవసాయ రంగంలో పారిశ్రామికీకరణ ప్రభావం గురించి వివరిస్తూ బ్రిటన్ విదేశాంగ సెక్రటరీ డొమినిక్ రాబ్ మరియు భారత ప్రదాని నరేంద్రమోడీకి తాము లేఖ రాశామని బ్రిటన్ వ్యాప్తంగా 1000మందికి పైగా చిన్న-మధ్యతరగతి రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న “ది ల్యాండ్ వర్కర్స్ కూటమి” తెలిపింది. చిన్న-మధ్యతరగతి వ్యవసాయ పద్దతులకు రెండు ప్రభుత్వాలు మద్దుతు తెలపాలని ఆ లేఖలో యూనియన్ అభ్యర్థించింది. ప్రస్తుతం భారతీయులు చేస్తోన్న ఆందోళన..గడిచిన మూడు దశాబ్దాలలో వ్యవసాయ కమ్యూనిటీ నుంచి తలెత్తిన అతిపెద్ద పౌరు ఆందోళనగా ఓ ప్రకటనలో ఈ సంఘం అభివర్ణించింది.

మరోవైపు, నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం కొంతకాలంగా శాంతియుతంగా జరుగుతున్న అన్నదాతల ఆందోళనలు మంగళవారం ఉద్రిక్తతలకు దారితీశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మక ఘటనలకు వేదికైంది. కొందరు రైతులు.. ఎర్రకోటలోకి ప్రవేశించారు. అక్కడ జాతీయ జెండా ఎగరవేసే స్తంభానికి వేర్వేరు రైతు సంఘాల జెండాలు కట్టారు. నిజానికి రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు ముగిసిన త‌ర్వాత రైతులు త‌మ ట్రాక్ట‌ర్ ప‌రేడ్ చేప‌ట్ట‌డానికి పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉద‌యం 8 గంట‌ల‌కే స‌రిహ‌ద్దులు దాటి ఢిల్లీలోకి దూసుకువ‌చ్చారు. ట్రాక్టర్​ ర్యాలీ కోసం.. రైతులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఢిల్లీలోకి ప్రవేశించగా పలు చోట్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.