లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న మోడీ…రైతుల ఆందోళనలకు విపక్షాలే కారణం

Published

on

FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్​తో వారణాసితో పాటు ప్రయాగ్​రాజ్​ వాసులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ హైవేని జాతికి అంతికతం చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.73 కిలోమీటర్ల పొడవు గల ఈ హైవేను 2,447 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ హైవే ప్రారంభంతో ప్రయాగ్‌రాజ్, వారణాసి మధ్య రోడ్డు ప్రయాణం గంటసేపు తగ్గనుంది. అనంతరం బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ..ఈ ప్రాజెక్టుతో వారణాసితో పాటు ప్రయాగ్​రాజ్​ వాసులు లబ్ధిపొందుతారన్నారు. గురునానక్ జయంతి మరియు దేవ్ దీపావళి సందర్భంగా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వారణాశి పొందుతుందని మోడీ తెలిపారు.ఇన్నేళ్లుగా వారణాసి పట్టణ సుందరీకరణకు ఎంతో కృషి చేశామని.. ఇప్పుడు కనెక్టివిటీపై దృష్టి సారించినట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు. నూతన రహదారులు, హైవేలు, ట్రాఫిక్​ జామ్​ను తగ్గించేందుకు వారణాశిలో మరియు వారణాశి చుట్టుపక్కల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. స్వాతంత్ర్యం నుంచి ఎన్నడూ లేని విధంగా గత కొంతకాలంగా వారణాసిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్టు ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సంస్కరణలు అన్నదాలకు మరింత శక్తినిస్తాయని పేర్కొన్నారు. నూతన చట్టాలతో అన్నదాతలకు న్యాయపరమైన రక్షణ కూడా లభించిందన్నారు. ఈ సంస్కరణ ఫలాలు రానున్న రోజుల్లో తెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.పెద్దస్థాయి మార్కెట్లలో అవకాశాలు కల్పించి.. అన్నదాతలను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని వెల్లడించారు. ఇవన్నీ రైతుల సంక్షేమం కోసమే చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మెరుగైన మద్దతు ధర, సౌకర్యాలు కల్పించే వారికి తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు దక్కకూడదా? అని ప్రశ్నించారు.గతంలో రైతు రుణ‌మాఫీ లాంటి ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించేవార‌ని, కానీ ఆ ఫ‌లాలు అంద‌రికీ అందేవి కావు అని మోదీ అన్నారు. తాము క‌ల్పిస్తున్న స్వేచ్ఛ వ‌ల్ల‌.. రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను అధిక ధ‌ర‌కే అమ్మే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను 1.5 రెట్లు పెంచాల‌న్న స్వామినాథ‌న్ క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న అమ‌లు చేశామ‌న్నారు. రైతుల‌కు త‌మ బ్యాంక్ అకౌంట్ల‌లో ఆ ఫ‌లాలు చేరేటట్లు చేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు.రైతుల మెద‌ళ్ల‌లో ద‌శాబ్ధాల నుంచి కొన్ని అపోహ‌లు ఉండిపోయాయ‌ని, అయితే రైతుల్ని మోసం చేయాల‌ని తాము భావించ‌డం లేద‌ని, కొత్త చ‌ట్టాలు.. పాత విధానాల‌ను అడ్డుకోలేవు అని, గంగా న‌ది తీరం నుంచి మాట్లాడుతున్నాన‌ని, త‌మ ఉద్దేశాలు కూడా గంగా న‌దిలా ప‌విత్రంగా ఉన్నాయ‌ని మోడీ అన్నారు. ఒక‌వేళ అంత‌కుముందు ఉన్న మార్కెటింగ్ వ్య‌వ‌స్థే ఉత్త‌మ‌మైన‌ద‌ని గ్ర‌హిస్తే, మ‌రి ఈ కొత్త చ‌ట్టాలు ఎలా అడ్డుకుంటాయ‌ని ఆయ‌న అడిగారు.కొత్త మార్కెట్ విధానంతో సాంప్ర‌దాయ మండీల‌కు ఎటువంటి న‌ష్టం ఉండ‌ద‌ని మోడీ అన్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కూడా మార‌ద‌ని ఆయ‌న తెలిపారు. జాతీయంగా, అంత‌ర్జాతీయంగా రైతుల‌కు మార్కెట్ క‌ల్పిస్తున్నామ‌ని ప్రధాని తెలిపారు.అంత‌ర్జాతీయ మార్కెట్ల నుంచి రైతుల‌కు పూర్తి ల‌బ్ధి చేకూరాల‌ని, భార‌త్‌లో త‌యార‌వుతున్న వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంద‌ని, మ‌రి రైతుల‌కు అలాంటి మార్కెట్ అందుబాటులో ఉండ‌కూడదా అని ఆయ‌న అన్నారు.గ‌తంలో మండీల బ‌య‌ట జ‌రిగే లావాదేవీల‌ను అక్ర‌మంగా భావించేవార‌ని, అయితే ఆ విధానం చిన్న రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉండేద‌ని, ఎందుకంటే వారు మండీల‌కు వ‌చ్చేవారు కాదు అని, అయితే కొత్త చ‌ట్టాల‌తో చిన్న చిన్న రైతులు కూడా మండీల బ‌య‌ట త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునే వీలు ఉంటుంద‌ని ప్ర‌ధాని తెలిపారు.ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మోడీ. ఒకప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారని…కానీ ఇప్పుడు ఊహాగానాలను, అసత్య వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తమ నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. విపక్షాలు ఊహాగానాలు వ్యాపింపజేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాగా,వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బోటులో దామరి ఘాట్​ నుంచి లలిత ఘాట్​కు ప్రయాణించారు. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కూడా మోడీ వెంటే వెళ్లారు. అనంతరం లలిత ఘాట్​ నుంచి ఇరువురు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాశీ ఆలయ కారిడర్​ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు.ఆ తర్వాత దేవ్​ దీపావళి మహోత్సవంలో మోడీ పాల్గొన్నారు. తొలి దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా సంక్షోభంలో ఎన్ని మారినా.. భక్తి, శక్తి, కాశీ మాత్రం మారదని అభిప్రాయపడ్డారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా.. దీపాలతో వారణాసి కళకళలాడింది. ఘాట్లల్లో 15లక్షల దీపాలను వెలిగించారు ప్రజలు.ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వారసత్వం అంటే దేశం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కానీ కొందరికి వారసత్వం అంటే సొంత కుటుంబం, సొంత పేరు అని విపక్షాలనుద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తమకు వారసత్వం అంటే సంప్రదాయాలు, విశ్వాసం అని.. కానీ కొందరికి వారసత్వం అంటే సొంత విగ్రహాలు, సొంత కుటుంబానికి చెందిన చిత్రపటాలన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *