Home » రైతుల ‘ఛలో ఢిల్లీ’లో చల్లారని ఉద్రిక్తతలు..లాఠీ ఛార్జ్ చేస్తున్నా వెనక్కి తగ్గని అన్నదాతలు
Published
2 months agoon
By
bheemrajfarmers chalo Delhi : రైతుల ఛలో ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తమకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి గళం వినిపించేందుకు రైతులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. లాఠీఛార్జ్‌లు, టియర్ గ్యాస్‌లు, వాటర్ కెనాన్లు రైతులను నివారించలేకపోతున్నాయి.
భారీగా మోహరించిన భద్రతా బలగాలను తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ రైతులు ఢిల్లీ వైపు కదులుతున్నారు. మరోవైపు రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు భద్రతాబలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలోని స్టేడియాలను జైళ్లుగా మార్చి రైతులను తరలించాలని భద్రతాబలగాలు భావిస్తుండగా ఢీల్లీ ప్రభుత్వం అందుకు నిరాకరిచింది.
ఢిల్లీ శివారులో రైతులు : అరెస్టు చేస్తే జైళ్లు చాలవు..స్టేడియాలు కావాలి – పోలీసులు
స్టేడియాలను జైళ్లుగా మార్చేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. తాము రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. మరోవైపు రైతుల ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్రం తక్షణమే రైతు సంఘాలతో చర్చలు జరపాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ చెప్పారు.