లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రైతుల ఆందోళనలు : అవార్డులు తిరిగిచ్చేస్తామని పంజాబ్ క్రీడాకారుల హెచ్చరిక

Published

on

Punjab sportspersons Threaten To Return Awards నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై ఆరు రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,రైతుల ఆందోళనలకు మద్దతు పలికిన పంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు కోచ్ లు…నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమకు వచ్చిన అవార్డులు,మెడల్స్ అన్నింటినీ తిరిగిచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన క్రీడాకారులలో… రెజ్లర్ మరియు పద్మశ్రీ అవార్డీ కర్తార్ సింగ్, అర్జున అవార్డ్ గ్రహీత మరియు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియు అర్జున అవార్డ్ గ్రహీత హాకీ ఆటగాడు గుర్మైల్ సింగ్, ఒలంపిక్ హాకీ ఆటగాడు మరియు అర్జున అవార్డ్ గ్రహీత సజ్జన్ చీమా, గోల్డెన్ గర్ల్ గా పిలువబడే మాజీ ఇండియన్ హాకీ కెప్టెన్ రజ్బిట్ కౌర్ కూడా ఉన్నారు.కేంద్రం వెంటనే నూతన అగ్రి చట్టాలను ఉపసంహరించుకోవాలని,ఆ చట్టాలు రైతులకు అనుకూలంగా లేవని ఇవాళ(డిసెంబర్-1,2020)జలంధర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఈ క్రీడాకారులందరూ డిమాండ్ చేశారు. కేంద్రం దిగి రాకుంటే దాదాపు 150మంది ప్రముఖ పంజాబ్ క్రీడాకారులందరూ తమకు వచ్చిన పద్మ,అర్జున అవార్డులను,మెడల్స్ ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ క్రీడాకారుడు వ్యాఖ్యానించారు.మరోవైపు, రైతుల ఆందోళనలు విరమించేలా ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ(డిసెంబర్-1,2020)36 మంది రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మూడవ రౌండ్ చర్చలు ప్రారంభించింది. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్,పియూష్ గోయల్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో పంజాబ్ కి చెందిన రైతులు, హర్యానా నుంచి ఇద్దరు రైతు సంఘాల ప్రతినిధులు,ఏఐకేఎస్ సీసీ లీడర్ యోగేంద్ర యాదవ్,ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో నాయకుడు పాల్గొన్నారు.రైతులు ఆందోళనలను విరమింపచేసేలా తగిన వ్యూహాన్ని సిద్దం చేసేందుకు ఇవాళ ఉదయం టాప్ బీజేపీ లీడర్లు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువరు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావైశమై చర్చించిన విషయం తెలిసిందే.అయితే, రైతుల ఆందోళనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉపసంహరించుకునే ప్రశక్తే లేదని,దీనిపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం సృష్టంగా చెబుతోంది. ఈ చట్టాలపై రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకే రైతులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం చెబుతోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *