Home » ఢిల్లీకి నో.. డిమాండ్లు ముందుపెట్టిన రైతులు
Published
2 months agoon
By
subhnFarmers Protest: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆఫర్ ను తిప్పికొట్టిన రైతులు.. ఢిల్లీలోని వెళ్లి బురారీ పార్క్ కు వెళ్లేందుకు నో చెప్పారు. జంతర్ మంతర్‌లో ఆందోళనను కొనసాగిస్తామని అప్పటి వరకూ ఇక్కడే చేస్తామంటున్నారు. ‘మేం బురారీ పార్క్‌కు వెళ్లేది లేదు. అది ఓపెన్ జైలు పార్క్ కాదని మాకు తెలుసు’ అని స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద భారతీయ కిసాన్ యూనియన్ క్రాంతికారి సుర్జిత్ సింగ్ అంటున్నారు.
ఢిల్లీ సింఘూ బోర్డర్ వద్ద జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో ఇలా మాట్లాడారు. వారి 4డిమాండ్లను బయటపెట్టారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఉందంటూ ఆ చట్టాల గురించి ప్రస్తావించారు. దాంతో పాటు పంటను కొనుగోలు చేసే ధరకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్ ను నిలిపేయాలన్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో రైతుల గురించి, కొత్త చట్టం గురించి ప్రస్తావించారు. వీటి ద్వారా రైతులకు కొత్త హక్కులు, కొత్త అవకాశాలు వచ్చాయని అన్నారు. సింఘు సరిహద్దు (ఢిల్లీ-హర్యానా) వద్ద నిరసనల్లో పాల్గొంటున్న రైతులకు ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజిమెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ఆహారం అందజేసింది.