Home » MSPపై రాతపూర్వక హామీ ఇస్తామన్న కేంద్రం…తిరస్కరించిన రైతులు
Published
2 months agoon
Farmers refuse Centers’s MSP offer నూతన వ్యవసాయ చట్టాలను ర్దదు చేయాలని,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలు ఫలించట్లేదు. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ రైతు లీడర్లతో కేంద్రం నాలుగో రౌండ్ చర్చలు జరుపుతోంది.
దాదాపు 5గంటలుగా చర్చలు జరుగుతన్నాయి. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్,సోమ్ ప్రకాష్,నరేంద్ర సింగ్ తోమర్ రైతు నాయకులతో చర్చలు జరుపుతున్నారు. కాగా, రైతుల అభ్యంతరాలపై కేంద్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఏది ఏమైనప్పటికీ కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టారు.
చట్టం రూపొందించే ముందే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని రైతులు వ్యాఖ్యానించారు. ప్రైవేట్ మార్కెట్ వల్ల కలిగే నష్టాలను రైతు సంఘాలు ప్రభుత్వానికి వివరించాయి. కొత్త చట్టాల వల్ల వచ్చే నష్టాలపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను రైతులు ఈ మీటింగ్ లో కేంద్రమంత్రులకు చూపించారు.
చర్చల సమయంలో కనీస మద్ధతు ధర(MSP)పై రాతపూర్వక హామీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. అయితే,కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టారు.