లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రిపబ్లిక్‌ డే రోజు లక్ష ట్రాక్టర్లతో రైతుల పరేడ్‌

Published

on

Farmers’ union leaders decided to a rally with one lakh tractors on Republic Day : కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపబోమని రైతు సంఘాల నేతలు మరోసారి తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన వెంటనే ఢిల్లీ ఔటర్ రింగ్‌ రోడ్‌పై లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ జెండాతో ట్రాక్టర్‌ పరేడ్‌ నిర్వహిస్తామని చెప్పారు.

దీంతో అధికారికంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎలాంటి అంతరాయం ఉండదని రైతు సంఘాల నేతలు అంటున్నారు. దాదాపు లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో రైతులు బయల్దేరారు. ఇదిలా ఉంటే రైతుల ట్రాక్టర్‌ ర్యాలీపై రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.