Farokh Engineer Apologises After Anushka Sharma's Hard-Hitting Post

అనుష్కకు క్షమాపణలు చెప్పిన ఫరూక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇంగ్లాండ్ లో వర్డల్ కప్ జరుగుతున్న సమయంలో సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ కప్పులు అందించారని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క శర్మ  గురువారం ఒక లేఖ రూపంలో తన పై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. అనుష్క లేఖ తర్వాత ఫరూక్ ఇంజినీర్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. తాను ఇండియన్ సెలక్టర్లను తప్పుపట్టాను కానీ అనుష్కను కాదని వివరణ ఇచ్చుకున్నాడు.

అనుష్క తన లేఖలో… ఎప్పుడు ఏన్ని విమర్శలు వచ్చిన తను స్పందించకపోవడం వల్లనే ఎప్పుడు తనని టార్గెట్ చేస్తున్నారు అని ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది. ఎప్పుడు ఏమి జరిగినా తన గురించి తప్పుగానే విమర్శలు వినపడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త టీమిండియా కెప్టెన్  విరాట్ కోహ్లి మంచి ప్రదర్శన ఇచ్చినా, ఇవ్వక పోయిన తనపై విమర్శలు చేయడం మంచిది కాదు అని అన్నారు. అసలు ఏమి జరుగిందో నిజనిజాలు తెలుసుకోని మాట్లాడాలి అన్నారు.

తాను ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా తన సొంత డబ్బులతోనే వెళ్తానని అనుష్క అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన్నను విమర్శించటం మానేయాలి అన్నారు. ఇక్కడితో నన్ను వదిలేయండి అని అనుష్క శర్మ లేఖలో తలిపారు. అయితే తాను ఇండియన్ సెలక్టర్లను తప్పుపట్టాను కానీ అనుష్కను కాదంటూ అనుష్క లేఖ తర్వాత ఫరూక్ తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకున్నాడు.

Related Posts