లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ప్రత్యేకహోదా కోసం ఒక్కటైన కశ్మీర్ పార్టీలు

Published

on

J&K Parties’ Alliance For Article 370 ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. జమ్మూకశ్మీర్ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NCP) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్​ సాజద్ లోన్​, పీపుల్స్ మూమెంట్ నేత జావైద్ మీర్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370పునరుద్దరణ కోసం కలిసి కూటమిగా పనిచేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించుకున్నారు.జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగ హోదా విషయంలో గుప్కర్ డిక్లరేషన్ పై భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసేందుకు రెండు గంటల పాటు ఫరూక్ నివాసంలో నాయకులు చర్చించారు. ఆర్టికల్ 370రద్దుకు ముందు…జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగహోదా ఆర్టికల్-370ని కాపాడుకునేందుకు, దీన్ని అణిచివేయాలని చూసే ఏ చర్యపైనైనా పోరాడేండుకు ఆగస్టు-4,2019న శ్రీనగర్ లోని గుప్కర్ రోడ్ లోని ఫరూక్ నివాసంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న కశ్మీర్ ప్రాంతీయ రాజకీయపార్టీలు,కాంగ్రెస్ గుప్కర్ డిక్లరేషన్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే.దీని తర్వాత రోజే కేంద్రం ఆర్టికల్-370ని రద్దు చేసింది. కశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లడఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఆర్టికల్-370రద్దు సమయంలో పలువురు ప్రధాన కశ్మీర్ నాయకులను నిర్భందంలో ఉంచిన విషయం తెలిసిందే. ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడకుండా ఫరూక్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా,మొహబూబా ముఫ్తీ వంటి మాజీ సీఎంలను సైతం నిర్భందంలో ఉంచారు. కాగా,కొన్నాళ్ల క్రితం ఫరూక్,ఒమర్ నిర్భందం నుంచి విడుదలవగా..మొహబూబా ముఫ్తీ రెండు రోజుల క్రితం విడుదలైంది.ఈ నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-15,2020) ఫరూక్ నివాసంలో ప్రధాన కశ్మీర్ పార్టీల నాయకులు సమావేశమయ్యారు. రెండు గంటల పాటు చర్చించిన తర్వాత భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ఫరూక్ అబ్దుల్లా మీడియాకు తెలిపారు. అందరు నేతలు ఏకతాటిపైకి వచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఈ కూటమికి ‘పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప​కార్​ డిక్లరేషన్​’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగే వరకు ఈ కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. కశ్మీర్ పీసీసీ చీఫ్ గులామ్ అహ్మద్ మీర్ ఆరోగ్య కారణాల రీత్యా ఈ భేటీకి హాజరుకాలేకపోయినట్లు కాంగ్రెస్ ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా 14 నెలల నిర్బంధం తర్వాత విడుదలైన ముప్తీకి అబ్దుల్లా శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *