కారుతో గుద్ది..ఆపై మీద నుంచి ఎక్కించిన మహిళ ఫ్యాషన్ డిజైనర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ మహిళా ఫ్యాషన డిజైనర్ రోడ్డుపై నిలిచిన నలుగురు వ్యక్తులపై కారును పోనిచ్చింది. దీంతో ఆ వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కిందపడిన వారిపై నుంచి కారును తీసుకెళ్లిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.సౌత్ ఢిల్లీలోని లజ్ పత్ నగర్ అమర్ కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో ఫ్యాషన్ డిజైనర్ రోష్నీ అరోరా శుక్రవారం రాత్రి BMW కారులో ఉన్నారు. ఈ కారుకు ఎదురుగా ఓ ఐస్ క్రీం బండి ఉంది. అక్కడ నలుగురు వ్యక్తులు నిలబడ్డారు. అకస్మాత్తుగా కారు వారిపై నుంచి దూసుకెళ్లింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్ పై ఆమె విడుదలయ్యారు. తాను కావాలని చేయలేదని, కారు వెనుక సీట్లో ఉన్న కుక్క ముందుకు దూకిందని, ప్రమాదవశాత్తు..తన కాలు ఆక్సిలేటర్ పై పడిందని..దీనివల్ల ప్రమాదం జరిగిందని ఆ మహిళా ఫ్యాషన్ డిజనర్ వెల్లడించారు.

Related Posts