భర్తతో సెక్స్‌లో పాల్గొనవద్దంటున్నాడని మామపై కంప్లైంట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వడోదరా మహిళా పోలీస్ స్టేషన్లో మామపై కోడలు కంప్లైంట్ చేసింది. భర్తతో సెక్స్ లో పాల్గొనకూడదని వారిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. తనకు దెయ్యం పట్టిందని సెక్స్ చేస్తే కొడుకు ఒంట్లోకి వస్తుందని చెప్పాడట. అంతేకాకుండా మామ-భర్త కలిసి గదిలో పెట్టి కొట్టారు. పోలీసులకు కంప్లైంట్ చేసి సహాయం అడిగిందని గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు.వడోదరాలోని మహిళ అతణ్ని పెళ్లాడింది. ‘మా మామ నా ఒంటిపై ఏవో ఆత్మలు ఉన్నాయని భావిస్తున్నాడు. ఒకవేళ సెక్స్ చేస్తే అతని శరీరంలోకి కూడా ఆత్మలు ప్రవేశిస్తాయని నమ్ముతున్నాడు. ఈ ప్రవర్తన పట్ల నిరసన తెలియజేయడంతో నన్ను మానసికంగా మామ-భర్త కలిసి హింసించడం మొదలుపెట్టారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు లైంగికంగా వేధించమని మా అత్తే మామను ఉసిగొల్పేది’ అని ఎఫ్ఐఆర్ లో చెప్పింది.మార్చి 10న బలవంతంగా ఇల్లు వదిలిపోవాలని మహిళ చెప్పింది. ఇతర కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ అయినప్పటికీ మామ ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పుకోవడం లేదు. డొమెస్టిక్ వయోలెన్స్, గాయపరచడం, క్రిమినల్ చర్యలు ఒడిగట్టడం వంటి నేరాలపై కేసులు ఫైల్ చేశారు.

Related Posts