father-loads-daughter-obscene-pics-in-laptop

తండ్రేనా, కూతురి నూడ్ ఫొటోలు ల్యాప్ ట్యాప్‌లో పెట్టుకున్నాడు, వాటిని చూస్తూ రాక్షసానందం పొందాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయిగా మారాడు. ఏ తండ్రి చేయకూడని పని చేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించాడు. కూతురి నగ్న చిత్రాలను ల్యాప్‌టాప్‌లో భద్రపర్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా వాటిని చూస్తూ రాక్షసానందం పొందాడు. ఓ రోజు తండ్రి నిజస్వరూపం తెలియడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.



రెండో పెళ్లి చేసుకున్నాడు, ల్యాప్ టాప్ లో కూతురి నగ్నచిత్రాలు:
నాచారం ప్రాంతంలో రెస్టారెంట్‌ ఓనర్‌గా పని చేస్తున్న నిందితుడు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు తన భార్యకు తెలియకుండా కుమార్తె అభ్యంతరకర ఫోటోలను తీసి తన ల్యాప్‌టాప్‌లో సేవ్‌ చేసుకున్నాడు. ఓ రోజు బాధితురాలు ల్యాప్‌టాప్‌ తీసి చూడగా తండ్రి బాగోతం బయటపడింది. కన్నతండ్రి ల్యాప్‌టాప్‌లో తన అభ్యంతరకర ఫోటోలు చూసి ఆమె తల్లడిల్లిపోయింది.



కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగి అరెస్ట్:
దీని గురించి బాధితురాలు తల్లికి తెలిపింది. ఆ తర్వాత నాచారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజుల తర్వాత అతడికి కరోనా సోకడంతో మందలించి విడిచిపెట్టారు. కోలుకోవడంతో ప్రస్తుతం నిందితుడిని మళ్లీ అరెస్ట్‌ చేశారు.



ఆడపిల్లకు ఇంట్లో కూడా రక్షణ కరువు:
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ తండ్రి తీరుతో స్థానికులు విస్తుపోయారు. వాడసలు తండ్రేనా అని చీదరించుకుంటున్నారు. ఆడపిల్లకు బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ కరువైందని వాపోతున్నారు. మృగాళ్లు వీధుల్లోనే కాదు ఇళ్లలోనూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకు ఇంట్లో కూడా రక్షణ కరువైతే, ఇక వారికి భద్రత లభించేది ఎక్కడ? అని అడుగుతున్నారు. కూతురని కూడా చూడకుండా వికృతంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts