father wears mask of wife  face to stop baby from crying

గుడ్ ఫాదర్ : బిడ్డ ఏడుపు ఆపటానికి ఆ తండ్రి ఏం చేశాడంటే  

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బిడ్డ ఏడిస్తే..నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తుంది తల్లి. అమ్మప్రేమ గురించి చెప్పుకున్నంతగా నాన్న వాత్సల్యం గురించి పెద్దగా చెప్పుకోం. బిడ్డలపై అమ్మ ప్రేమ ముందు నాన్న తేలిపోతాడు. బిడ్డలు బుడి బుడి అడుగులు వేస్తుంటే.. నడక నేర్పేది అమ్మ అయితే.. చిట్టి పొట్టి పాదాలు కందిపోకుండా తన అరచేతులనే పానుపులుగా పరుస్తాడు నాన్న. అటువంటి నాన్న అమ్మకు ఎప్పుడూ పోటీగా ఉండడు. అమ్మ కోసం బిడ్డ ఏడుస్తుంటే ఆ ఏడుపు ఆపటానికి నవ్వించటానికి పడరాని పాట్లు పడతాడు. అటువంటి ఓ నాన్న సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసల్ని కొట్టేస్తున్నాడు. 

తల్లి కోసం ఏడుస్తున్న తన బిడ్డ కోసం అతడు చేసిన ఓ చిలిపి పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిడ్డ అమ్మకోసం ఏడుస్తోంది. ఏం చేసినా ఏడుపు మాత్రం ఆపలేదు. దీంతో అతను తన భార్య ఫొటోను మాస్కులా తయారు చేసుకుని.. భార్యలా బట్టలు వేసుకుని ఆ బిడ్డ పక్కన పడుకున్నాడు. అంతే.. ఆ బిడ్డ ఏడుపు ఆపి నవ్వడం మొదలుపెట్టింది. కాసేపటికి అమ్మ అనుకున్న నాన్న పక్కలో చక్కగా బజ్జుంది. హాయిగా నిద్రపోయింది.

నెటిజన్లు ఆ తండ్రిని తెగ మెచ్చేసుకుంటున్నారు. ‘ఫాదర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తండ్రులు కూడా తల్లితో సమానంగా పిల్లలను లాలిస్తున్నారని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఈ తండ్రికి ‘ఫాదర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వొచ్చు అంటున్నారు.

Related Posts