Home » అక్షయ్ ఫౌజీ మొబైల్ గేమ్ FAU-G వచ్చేసింది.. PUB-Gకి పోటీనా?
Published
1 month agoon
సుదీర్ఘ నిరీక్షణ తరువాత, గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వదేశీ ఆన్లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ FAU-G 72వ గణతంత్రదినోత్సవ కానుకగా విడుదలయ్యింది. ఇప్పటికే ఈ స్వదేశీ గేమ్‌కు విపరీతమైన క్రేజ్ రాగా.. ప్రీ-రిజిస్ట్రేషన్లలో కూడా సత్తా చాటినట్లు ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ వెల్లడించారు. నేటి(26 జనవరి 2021) నుంచి గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. FAU-G డెవలపర్ nCore ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
FAU-G గేమ్ Android 8 లేదా దాని అప్‌గ్రేడ్ వెర్షన్లలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 8 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తే, అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో FAU-G గేమ్ డౌన్లోడ్ చేయలేరు. అలాగే, iOS- ఆధారిత ఐఫోన్లు మరియు ఐప్యాడ్ల నమోదుకు FAU-G గేమ్ అందుబాటులో లేదు.
వాస్తవానికి FAU-Gను 2020లో భారతదేశంలో ప్రారంభించవలసి ఉండగా.. అది జరగలేదు. ఇప్పుడు దీనిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. భారతదేశంలో మరే గేమ్‌కు కూడా ఇప్పటివరకు ఇటువంటి స్పందన రాలేదని, గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభించిన 24 గంటల్లో FAU-G 10 లక్షలకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లు సాధించినట్లు, తరువాత కంపెనీ 40 లక్షల మార్కును దాటడానికి నెలన్నర సమయం పట్టినట్లు కంపెనీ వెల్లడించింది. పబ్జీపై నిషేధం విధించిన కొద్ది నెలల తర్వాత FAU-G గేమ్ తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఆయనే ఈ గేమ్‌కి మెంటార్‌గా ఉన్నారు.
గత నాలుగు దశాబ్దాలలో చైనా, భారతదేశం మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ గేమ్ రూపొందినట్లుగా కంపెనీ చెబుతోంది. FAU-G ఒక మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ కాగా.. చాలా మంది భారతీయ గేమర్స్ దీనిని Pub-G మొబైల్‌కి ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదని, Pub-G మొబైల్‌కి FAU-G చాలా భిన్నమైన గేమ్ అని ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం గేమ్‌కు సంబంధించి మొదటి ఎపిసోడ్ మాత్రమే విడుదలైంది. ఇది గత సంవత్సరం భారత్ మరియు చైనా సైన్యం మధ్య గాల్వన్ వ్యాలీలో జరిగిన యుద్ధం నేపధ్యంలో ఎపిసోడ్‌పై దృష్టి పెట్టింది. FAU-G ఆటకు మీరు ప్రధానంగా చైనా సైన్యం లేదా ప్రత్యర్థులతో పోరాడాలి. మరొక వైపు చిక్కుకున్న భారత సైన్యాన్ని రక్షించాలి. FAU-G గేమ్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలో మిగిలిన భారతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రావచ్చునని కంపెనీ చెబుతోంది.
పబ్ జి లవ్ : ప్రియుడిని చూసేందుకు వెళ్లిన పెళ్లైన మహిళ, తర్వాత షాక్
తమిళ్ నేర్చుకోలేకపోయినందుకు భాధపడుతున్నా : మోడీ
గూగుల్ మ్యాప్స్ లో భారీ మార్పులు, పది భాషల్లో
పబ్జీ రెండు కొత్త గేమ్‌లతో వస్తోంది.. పీసీ, మొబైల్ రెండింట్లో ఆడొచ్చు!
పబ్జీ రీ లాంచ్ చేస్తున్న దేశాలు.. ఇండియాలో అప్డేట్ ఏంటో..
హిజ్రాల కోసం ఇస్లామిక్ స్కూల్..