లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

ఇక లాలాజలంతో కరోనా టెస్టులు

Published

on

లాలాజలంతో కరోనా ‌ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కరోనా టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.



స్వాబ్‌ ద్వారా తీసుకొనే నమూనాల కంటే ఈ నూతన పద్ధతిలో తక్కువ హాని ఉంటుందని, దాదాపు 90శాతం కచ్చితమైన ఫలితం వస్తున్నట్లు నిపుణులు తెలిపారు. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన ఈ నూతన విధానాన్ని అంతర్జాతీయ ఆరోగ్యరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గొంతు, ముక్కు ద్వారా నమూనాలు(స్వాబ్‌)ను కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం సేకరిస్తున్నారు. ఇవి సేకరించే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి రావడం, నమూనాలు భద్రపరచడం, ఫలితానికి సమయం, ఖర్చు వంటి సవాళ్లు ఎదురౌతున్నాయి. అంతేకాకుండా శాంపిళ్ల సేకరణ కూడా అత్యంత జాగ్రత్తగా తీసుకోవడం మరో కీలకాంశం. వీటిని అధిగమించే నూతన విధానానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది.



ఇదిలా ఉంటే, కరోనాను ‌నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం స్వాబ్‌ పద్ధతినే అవలంభిస్తున్నారు. భారత్‌ వంటి దేశాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌తోపాటు ట్రూనాట్‌, సీబీనాట్‌ విధానాల ద్వారా కూడా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఎఫ్‌డీఏ ఆమోదించిన సలైవా టెస్ట్‌ పద్ధతిలో నోటినుంచి లాలాజలాన్ని తీసుకొని పరీక్షిస్తారు. ఈ విధానం వల్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడంతోపాటు పరీక్షల్లో కీలకమైన రియేజెంట్ల లోటును భర్తీ చేయవచ్చని ఎఫ్‌డీఏ కమిషనర్‌ స్టీఫెన్‌ హాన్‌ స్పష్టం చేశారు.



అయితే ఇప్పటికే లాలాజలంతో పరీక్షించే నాలుగు రకాల పద్ధతులకు ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. అయితే వాటి ఫలితాల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ‘సలైవాడెరెక్ట్‌’ పేరుతో యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నిపుణులు అభివృద్ధి చేసిన ఈ విధానంతో స్వాబ్‌ పరీక్షలకు సమాన ఫలితాలు ఉన్నట్లు గుర్తించామని ఎఫ్‌డీఏ పేర్కొంది. అత్యవసర వినియోగంలో భాగంగా ఈ నూతన పద్ధతికి అనుమతి ఇస్తున్నట్లు ఎఫ్‌డీఏ ప్రకటించింది.

అత్యంత తేలికగా నమూనాలు సేకరించి, పరీక్షించే ఈ విధానం రానున్న రోజుల్లో కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణలో ‘గేమ్‌ ఛేంజర్’గా మారే అవకాశాలున్నాయని సలైవాడెరెక్ట్‌ అభివృద్ధిలో భాగమైన పరిశోధకులు నాధాన్‌ గ్రూబౌగ్‌, అన్నే వైల్లీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా మిగతా పద్ధతులతో పోల్చితే చాలా తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *